Ravanausra OTT Release: రావణాసుర ఓటీటీ విడుదలపై ఆసక్తికర అప్డేట్.. ఎందులో, ఎప్పుడొస్తుందంటే?-ravi teja ravanasura to stream on amazon prime video ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravi Teja Ravanasura To Stream On Amazon Prime Video Ott Platform

Ravanausra OTT Release: రావణాసుర ఓటీటీ విడుదలపై ఆసక్తికర అప్డేట్.. ఎందులో, ఎప్పుడొస్తుందంటే?

Maragani Govardhan HT Telugu
Apr 09, 2023 07:50 AM IST

Ravanausra OTT Release: రవితేజ నటించిన రావణాసుర మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తిక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం.

రావణాసుర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
రావణాసుర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Ravanausra OTT Release: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం రావణాసుర. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రానికి వసూళ్ల పరంగానూ దూసుకెళ్తోంది. నెగిటివ్ పాత్రలో రవితేజ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది. ఈ మూవీ ఓటీటీ విడుదలకు సంబందించిన వార్త బయటకొచ్చింది.

రావణాసుర ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. భారీ ధరకు ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఓటీటీ విడుదల విషయంలోనూ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రావణాసుర మేకర్స్‌తో ఈ ఓటీటీ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం విడుదలైన 8 వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే రావణాసుర శాటిలైట్ రైట్స్‌ను జీ సంస్థ సొంతం చేసుకుంది. 50 రోజల తర్వాత అంటే మే చివర్లో ఈ మూవీ డిజిటల్‌తో పాటు టీవీల్లోనూ సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక థియేటర్లలో విడుదలైన తొలి రోజు రావణాసుర ఏడు కోట్ల గ్రాస్‌ను రూ.3 కోట్ల 80 లక్షల షేర్‌ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ పండితుల అంచనా. అయితే రవితేజ గత చిత్రం ధమాకా ఓపెనింగ్స్‌ను మాత్రం ఇది బీట్ చేయలేకపోయింది. ధమాకా తొలి రోజు రూ. 10 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్షన్ వర్ధన్ రామేశ్వర్-భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అను ఇమ్మాన్యూయేల్, ఫరియా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ, మేఘ ఆకాష్ కీలక పాత్రలు పోషించారు.

IPL_Entry_Point