Ravanasura Streaming On Amazon Prime: ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేసిన రావ‌ణాసుర - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే-ravi teja ravanasura streaming now on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravi Teja Ravanasura Streaming Now On Amazon Prime Video

Ravanasura Streaming On Amazon Prime: ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేసిన రావ‌ణాసుర - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Apr 28, 2023 06:29 AM IST

Ravanasura Streaming On Amazon Prime: ర‌వితేజ రావ‌ణాసుర మూవీ శుక్ర‌వారం ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఏ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందంటే....

ర‌వితేజ రావ‌ణాసుర
ర‌వితేజ రావ‌ణాసుర

Ravanasura Streaming On Amazon Prime: ర‌వితేజ(Raviteja) రావ‌ణాసుర మూవీ ఓటీటీలో రిలీజైంది. శుక్ర‌వారం నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో రావ‌ణాసుర మూవీ స్ట్రీమింగ్ కానుంది. ర‌వితేజ‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్‌కు ముందే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను ద‌క్కించుకొంది.

రివేంజ్ డ్రామాతో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో ర‌వితేజ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో న‌టించాడు. ఈ సినిమాకు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏప్రిల్ 7న భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా ప‌రాజ‌యం పాలైంది. ర‌వితేజ యాక్టింగ్‌కు పేరొచ్చిన ఔట్‌డేటెడ్ స్టోరీ కార‌ణంగా ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

అందువ‌ల్లే ఇర‌వై రోజుల్లోనే రావ‌ణాసుర ఓటీటీలో రిలీజైన‌ట్లు చెబుతోన్నారు. రావ‌ణాసుర సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, ఫ‌రియా అబ్దుల్లా, మేఘా ఆకాష్‌, ద‌క్షా న‌గార్క‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. సుశాంత్ కీల‌క పాత్ర‌ను పోషించారు.

రావ‌ణాసుర క‌థేమిటంటే...

తాను ప్రేమించిన మ‌హాల‌క్ష్మి ద‌గ్గ‌రే జూనియ‌ర్ లాయ‌ర్‌గా ప‌నిచేస్తోంటాడు ర‌వీంద్ర‌. మ‌రోవైపు సిటీలో చాలా మంది ప్ర‌ముఖులు వ‌రుస‌గా హ‌త్య‌ల‌కు గుర‌వుతుంటారు. ఈ మ‌ర్డ‌ర్స్‌తో ర‌వీంద్ర‌కు ఎలాంటి సంబంధం ఉంది? క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా ప‌నిచేసే అత‌డు ఎందుకు క్రిమిన‌ల్‌గా మారాడు అనే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. 22 కోట్ల‌కుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ కేవ‌లం 11 కోట్లు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.