Jagamerigina Satyam: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ర‌వితేజ మేన‌ల్లుడు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జ‌గ‌మెరిగిన స‌త్యం-ravi teja nephew avinash varma debut as hero with jagamerigina satyam telangana backdrop movie release date fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jagamerigina Satyam: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ర‌వితేజ మేన‌ల్లుడు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జ‌గ‌మెరిగిన స‌త్యం

Jagamerigina Satyam: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న ర‌వితేజ మేన‌ల్లుడు - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో జ‌గ‌మెరిగిన స‌త్యం

Nelki Naresh HT Telugu

Jagamerigina Satyam: ర‌వితేజ మేన‌ల్లుడు అవినాశ్ వ‌ర్మ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. జ‌గ‌మెరిగిన స‌త్యం పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలోని ఏరువాక అనే పాట‌ను రాజేంద్ర‌ప్ర‌సాద్ రిలీజ్ చేశారు.

జ‌గ‌మెరిగిన స‌త్యం

Jagamerigina Satyam: ర‌వితేజ ఫ్యామిలీ నుంచి మ‌రో కొత్త హీరో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ర‌వితేజ మేన‌ల్లుడు అవినాష్ వ‌ర్మ హీరోగా జ‌గ‌మెరిగిన స‌త్యం పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీలో అవినాష్ వర్మకు జోడీగా ఆద్య రెడ్డి, నీలిమ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఈ మూవీతో తిరుప‌తి పాలే డైరెక్ట‌ర్‌గా తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు.

ఏప్రిల్ 18న రిలీజ్‌...

ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఏప్రిల్18న జ‌గ‌మెరిగిన స‌త్యం థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ నుండి ఏరువాక ఆగే అనే సాంగ్ ను న‌టుడు రాజేంద్రప్రసాద్ రిలీజ్ చేశారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో...

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా జ‌గ‌మెరిగిన స‌త్యం మూవీ రూపొందుతున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌ 1994 లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కుతోంది.

తెలంగాణ‌, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని గ్రామాల్లో ఉండే క‌ట్టుబాట్లు, ఆచారాల‌కు ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను జోడించి హృద్యంగా ఈ మూవీ సాగుతుంద‌ని దర్శకుడు తిరుపతి పాలే అన్నారు. రియ‌లిస్టిక్ లోకేష‌న్స్‌లో ఈ మూవీని షూట్ చేసిన‌ట్లు చెప్పారు. జ‌గ‌మెరిగిన స‌త్యం మూవీకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నాడు. అచ్చు విజయ భాస్కర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఏరువాక సాంగ్‌...

జ‌గ‌మెరిగిన స‌త్యం సినిమాలోని ఏరువాక అనే పాట‌ను రాజేంద్ర‌ప్ర‌సాద్ రిలీజ్ చేశారు. అనంత‌రం రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ "జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. నేను విడుదల చేసిన ఏరువాక ఆగే సాంగ్ ఎమోషనల్ గా ఉంది.

మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 18న ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూసి కొత్త నటీనటులను ఎంకరేజ్ కోరుకుంటున్నాను" అని అన్నారు. ఈ సినిమాలోని మాయ‌లోక‌మేరా, కొమ్మ కొమ్మ పూలు అనే పాట‌ల‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం