థియేటర్లలో మళ్లీ రవితేజ మూవీ సందడి.. ఆరోజే మిరపకాయ్ రీ రిలీజ్.. మోగిపోనున్న సాంగ్స్.. మరి ఏ ఓటీటీలో ఉందో తెలుసా?-ravi teja mirapakay movie re release in theaters on july 11th mirapakay ott streaming on amazon prime ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  థియేటర్లలో మళ్లీ రవితేజ మూవీ సందడి.. ఆరోజే మిరపకాయ్ రీ రిలీజ్.. మోగిపోనున్న సాంగ్స్.. మరి ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

థియేటర్లలో మళ్లీ రవితేజ మూవీ సందడి.. ఆరోజే మిరపకాయ్ రీ రిలీజ్.. మోగిపోనున్న సాంగ్స్.. మరి ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

Sanjiv Kumar HT Telugu

థియేటర్లలో మళ్లీ రవితేజ సినిమా మిరపకాయ్ సందడి చేయనుంది. రవితేజ యాక్టింగ్‌తో ఇరగదీసిన మిరపకాయ్ మూవీ రీ రిలీజ్ కానుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిరపకాయ్ సినిమా సాంగ్స్ మళ్లీ మోగిపోనున్నాయి. అయితే, మిరపకాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

థియేటర్లలో మళ్లీ రవితేజ మూవీ సందడి.. ఆరోజే మిరపకాయ్ రీ రిలీజ్.. మోగిపోనున్న సాంగ్స్.. మరి ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

మాస్ మహారాజ రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. రవితేజ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో మిరపకాయ్ ఒకటి. ఈ సినిమా గురించి అందరికీ తెలిసిందే.

ఇద్దరు హీరోయిన్స్

మిరపకాయ్ సినిమాకు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్స్‌గా నటించారు. అలాగే, ఈ సినిమాలో నాగబాబు, ప్రకాష్ రాజ్, సుప్రీత్ రెడ్డి, సునీల్, చంద్రమోహన్, రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, కోట శ్రీనివాస రావు, రాజా రవీంద్ర, అలీ, ఫిష్ వెంకట్ తదితరులు నటించారు.

రవితేజ నటనకు ఫిదా

మిరపకాయ్ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులో కామెడీని ఇప్పటికీ చూసి నవ్వుకుంటారు. రిషిగా రవితేజ యాక్టింగ్ అదరగొట్టగా.. బ్రహ్మాజీ, సునీల్, అలీతో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అలాంటి మిరపయకాయ్ సినిమా మళ్లీ సందడి చేయనుంది.

మిరపకాయ్ రీ రిలీజ్

మిరపకాయ్ రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జులై 11న ‘మిరపకాయ్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హనుమాన్ మీడియా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. రమేష్ పుప్పల ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.

మిరపకాయ్ సాంగ్స్

థమన్ సంగీతం అందించిన మిరపకాయ్ సాంగ్స్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిరపకాయ్ రీ రిలీజ్ కానున్న సందర్భంగా థియేటర్లలో ఆ పాటలు మళ్లీ మారుమోగిపోనున్నాయి. దీంతో ‘మిరపకాయ్’ మూవీ రీ రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అయితే, ప్రస్తుతం మిరపకాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో మిరపయకాయ్ ఓటీటీ రిలీజ్ అయింది. 2011లో జనవరి 12న విడుదలైన మిరపకాయ్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.3 రేటింగ్ వచ్చింది.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్

ఇదిలా ఉంటే, ఇటీవల రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం విడుదలై మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది. అదే తరహాలో మిరపకాయ్ సందడి చేయబోతోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం