Telugu OTT: రవితేజ క్రాక్, శ్రీవిష్ణు అల్లూరి సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ తెలుగు మూవీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజయ్యాయి. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్‌గా ప్రకటించింది.
రవితేజ హీరోగా నటించిన క్రాక్ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. రవితేజ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
క్రాక్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ విలన్ పాత్రల్లో కనిపించారు. ఏపీ, తెలంగాణలో జరిగిన కొన్ని క్రైమ్స్ ఆధారంగా క్రాక్ కథను రాసుకున్నట్లు ప్రమోషన్స్‌లో గోపీచంద్ మలినేని చెప్పాడు. శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన తగరు మూవీకి క్రాక్ రీమేక్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
వీరశంకర్ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. సీఐగా ఒంగోలుకు ట్రాన్స్‌ఫర్ మీద వస్తాడు. ఒంగోలు సిటీని కఠారి కృష్ణ అనే రౌడీ శాసిస్తుంటాడు. కఠారి కృష్ణ ఒక్కో క్రైమ్‌కు వీరశంకర్ పుల్‌స్టాప్ పెడుతుంటాడు. వీరశంకర్ పనిచేసే పోలీస్ స్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్ హత్యకు గురువుతాడు. ఈ కేసు ఇన్వేస్టిగేషన్‌లో వీరశంకర్ తెలుసుకున్న నిజాలేమిటి? కానిస్టేబుల్ హత్యకు కఠారి కృష్ణకు ఎలాంటి సంబంధం ఉంది? వీర శంకర్ కోసం అతడి భార్య కళ్యాణి ఎలాంటి త్యాగం చేసింది అన్నదే ఈ మూవీ కథ.
శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి థియేటర్లలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో డ్రాగన్ ఫేమ్ కయదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ప్రదీప్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఓ పోలీస్ ఆఫీసర్ జీవితం స్ఫూర్తితో ఫిక్షన్ బయోపిక్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
సీతారామరాజు ఓ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. జాబ్‌లో ప్రమోషన్స్ కంటే ట్రాన్స్‌ఫర్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని క్లిష్టతరమైన ఆపరేషన్స్‌ను సీతారామరాజు ఎలా పూర్తిచేశాడు? ఈ క్రమంలో అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? సీతారామరాజును ప్రాణంగా ప్రేమించిన సంధ్య జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే అల్లూరి మూవీ కథ. ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఎనిమిది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
సంబంధిత కథనం