Ravi Teja Eagle: రవితేజ ఫ్యాన్స్‌ను భయపెడుతోన్న ఫిబ్రవరి సెంటిమెంట్ - ఈగల్ పోస్ట్‌పోన్‌పై ట్రోల్స్
Ravi Teja Eagle: ఈగల్ రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంతో రవితేజ ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతోన్నారు. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతోండగా...ఎప్పుడో షూటింగ్ పూర్తయిన ఈగల్‌ను పోస్ట్‌పోన్ చేయడం అన్యాయమంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Ravi Teja Eagle: రవితేజ ఈగల్ మూవీ సంక్రాంతి రేసు నుంచి అఫీషియల్‌గా తప్పుకున్నది. సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగతో పాటు తేజా సజ్జా హనుమాన్ సినిమాలు రిలీజ్ అవుతోన్నాయి. ఈ సినిమాలన్నింటికి థియేటర్లు దొరకడం కష్టం కావడంతో పాటు కలెక్షన్స్‌పై ప్రభావం పడి నిర్మాతలు నష్టపోయే ఆస్కారం ఉండటంతో తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంక్రాంతి సినిమాల నిర్మాతలతో చర్చలు జరిపింది.
ఈ చర్చల్లో ఈగల్‌ను పోస్ట్‌పోన్ చేయాలని డిసైడ్ చేశారు. జనవరి 13న రావాల్సిన ఈసినిమాను ఫిబ్రవరికి పోస్ట్‌పోన్‌చేశారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈగల్ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలిసింది. సంక్రాంతికి ఈగల్ కోసం కేటాయించిన థియేటర్లను గుంటూరు కారంతో పాటు సైంధవ్, నా సామిరంగలకు అడ్జెస్ట్ చేయబోతున్నట్లు సమాచారం.
జనవరి 26 అనుకున్నారు కానీ...
తొలుత ఈగల్ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్స్ భావించారు. కానీ జనవరి 26న రావడానికి రవితేజ అంగీకరించలేదని సమాచారం. అందుకే ఫిబ్రవరికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఫిబ్రవరి మంత్ రవితేజకు అంతగా కలిసిరాలేదు. రవితేజ కెరీర్‌లో ఫిబ్రవరిలో రిలీజైన సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
రవితేజ హీరోగా నటించిన షాక్, నిప్పు, టచ్ చేసి చూడుతో పాటు ఖిలాడీ సినిమాలు ఫిబ్రవరి నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ సినిమాలన్నీ రవితేజకు షాకింగ్ రిజల్ట్‌ను ఇచ్చాయి. ఫిబ్రవరి సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈగల్ రిజల్ట్‌పై ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఫిబ్రవరి నెలలో రిలీజ్ వద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈగల్ పోస్ట్‌పోన్‌పై ట్రోల్స్...
సంక్రాంతికి రావాల్సిన ఈగల్ వాయిదాపడటంతో రవితేజ ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతున్నారు. మిగిలిన హీరోల కోసం ఈగల్ సినిమాను బలిచేశారంటూ రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రైతులపై సినిమా తీసిన రవితేజకు విలువ లేకుండా చేశారంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
నెల రోజుల క్రితమే షూటింగ్ పూర్తయిన ఈగల్ పోస్ట్‌పోన్ చేశారు. ఇంకా షూటింగ్ కూడా కంప్లీట్ కానీ నా సామిరంగ మాత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఏదెక్కడి న్యాయం.. అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈగల్ పోస్ట్‌పోన్‌పై రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతోన్నారు. రవితేజ ఫ్యాన్స్ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్...
ఈగల్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో రవితేజ స్నైపర్ పాత్రలో కనిపించబోతున్నాడు. తన ఏజ్‌కు తగ్గ పాత్రను రవితేజ చేస్తోన్నట్లు సమాచారం.
ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. ధమాకా సక్సెస్ తర్వాత రవితేజతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన సినిమా ఇది. దాదాపు యాభై కోట్ల బడ్జెట్‌తో ఈగల్ తెరకెక్కినట్లు సమాచారం. దర్శకుడిగా కార్తిక్ ఘట్టమనేనికి ఇది రెండో మూవీ. గతంలో సూర్య వర్సెస్ సూర్య అనే సినిమా చేశాడు.