Dhamaka Pre Release Business: ధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్ - బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే
Dhamaka Pre Release Business: రవితేజ హీరోగా నటించిన ధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావాలంటే...
Dhamaka Pre Release Business: రవితేజ హీరోగా నటించిన ధమాకా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మల్టీమిలియనీర్‌గా, నిరుద్యోగిగా రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.
రవితేజ గత రెండు సినిమాలు పరాజయం పాలైన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం భారీగానే జరిగినట్లు సమాచారం. దాదాపు 19 కోట్ల వరకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. నైజాం ఏరియాలో ఐదున్నర కోట్లు వరకు బిజినెస్ జరిగినట్లు తెలిసింది.
సీడెడ్‌లో మూడు కోట్లు, ఆంధ్రాలో ఎనిమిది కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలిసింది. కర్ణాటక, రాయచూర్‌తో పాటు ఓవర్‌సీస్‌లో రెండున్నర కోట్ల వరకుధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. మొత్తంగా 19 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇరవై కోట్ల కలెక్షన్స్ వస్తే ధమాకా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
రవితేజ గత రెండు సినిమాలు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసినిమా ఇరవై కోట్ల కలెక్ట్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ధమాకా సినిమాను నిర్మించారు. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు, రావణాసురతో పాటు చిరంజీవి వాల్తేర్ వీరయ్యలో హీరోగా నటిస్తున్నాడు.