Ravansura Teaser Release Date: రావణాసుర టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్-ravansura teaser release date announced by the makers on wednesday march 1st
Telugu News  /  Entertainment  /  Ravansura Teaser Release Date Announced By The Makers On Wednesday March 1st
రావణాసుర మూవీలో రవితేజ
రావణాసుర మూవీలో రవితేజ

Ravansura Teaser Release Date: రావణాసుర టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

01 March 2023, 17:00 ISTHari Prasad S
01 March 2023, 17:00 IST

Ravansura Teaser Release Date: రావణాసుర టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Ravansura Teaser Release Date: ధమాకా మూవీ సూపర్ సక్సెస్ తో మాస్ మహారాజా రవితేజ మళ్లీ గాడిలో పడ్డాడు. ఈ మూవీ వంద కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడతడు తన నెక్ట్స్ మూవీ రావణాసురపై ఆశలు పెట్టుకున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై రవితేజ అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. స్వామి రా రా ఫేమ్ సుధీర్ వర్మ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ నుంచి తాజాగా ఓ సూపర్ అప్‌డేట్ వచ్చింది. రావణాసుర టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్సయింది. ఈ మూవీ టీజర్ ను మార్చి 6 ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ బుధవారం (మార్చి 1) అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా రవితేజకు సంబంధించిన ఓ ఇంటెన్స్ ఫొటోను కూడా రిలీజ్ చేశారు.

ఇందులో రవితేజ చాలా ట్రెండీ లుక్ లో కనిపిస్తున్నాడు. రావణాసుర మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీని ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నారు. రావణాసుర మూవీని అభిషేక్ నామా, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సెసిరోలియో ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక రావణాసుర మూవీలో శ్రీరామ్, అను ఎమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజితా పొన్నడా, రావ్ రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.

సంబంధిత కథనం