Bigg Boss 7 Telugu: వెన్నుపోటు పొడిచిన అమ్మాయితోనే ప్రిన్స్ రొమాన్స్.. శివాజీ ఫైర్.. ఇదెక్కడి ట్విస్ట్ బిగ్ బాస్-rathika prince yawar romance in bigg boss 7 telugu september 20th episode promo 1 day 17 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Rathika Prince Yawar Romance In Bigg Boss 7 Telugu September 20th Episode Promo 1 Day 17

Bigg Boss 7 Telugu: వెన్నుపోటు పొడిచిన అమ్మాయితోనే ప్రిన్స్ రొమాన్స్.. శివాజీ ఫైర్.. ఇదెక్కడి ట్విస్ట్ బిగ్ బాస్

Sanjiv Kumar HT Telugu
Sep 20, 2023 01:57 PM IST

Bigg Boss 7 Telugu Day 17 Promo: నిజంగానే బిగ్ బాస్ 7 తెలుగు ఉల్టా పుల్టాగా ఉంది. ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తనను అనర్హుడు అని చెప్పి వెన్నుపోటు పొడిచిన రతిక రోజ్‍తోనే ప్రిన్స్ యావర్ రొమాన్స్ చేస్తూ కనిపించడం షాక్ ఇచ్చింది.

వెన్నుపోటు పొడిచిన అమ్మాయితోనే ప్రిన్స్ రొమాన్స్.. శివాజీ ఫైర్
వెన్నుపోటు పొడిచిన అమ్మాయితోనే ప్రిన్స్ రొమాన్స్.. శివాజీ ఫైర్

బిగ్ బాస్ 7 తెలుగు మూడో పవరాస్త్ర కోసం ముగ్గురుని కంటెండర్స్ గా ప్రకటించిన బిగ్ బాస్ అనర్హులు ఎవరో చెప్పమని మిగతా సభ్యులకు చెప్పాడు. అప్పటివరకు తనతో ట్రాక్ నడిపిన రతిక.. ప్రిన్స్ యావర్ అనర్హుడని వెన్నుపోటు పొడిచింది. ఆ వీడియోను ప్లే చేసి మరి యావర్‍కు చూపించాడు బిగ్ బాస్. దీంతో సైకోలా బిహేవ్ చేసి అందరిని భయపెట్టిన ప్రిన్స్ అదే దెబ్బేసిన రతికతో రొమాన్స్ చేయడం తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 20 ఎపిసోడ్ ప్రోమో షాక్ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

నీకోసం ఎప్పుడూ

ప్రోమోలో తెలుగు రాదు.. తెలుగు రాదు అని నిన్న అన్నారు కదా సర్. మళ్లీ ఆ టాపిక్ ఎందుకు తీశారు అని శివాజీని ప్రశ్నించాడు ప్రిన్స్. దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నేను దీని గురించి కేవలం నాగ్ సార్‍తోనే మాట్లాడతాను అని చెప్పిన యావర్.. తనవైపు చూస్తున్న రతికతో నేను నీకోసం ఎప్పుడూ ఉంటాను. రోటి తింటావా. ఏమైంది.. లైట్ తీస్కో అని చెప్పాడు. దీంతో ఓ లవ్ సాంగ్ వేశారు. అప్పుడు వీళ్ల సరసాలు తగలెయ్యా అనుకుంటూ ప్రశాంత్ వెళ్లిపోయాడు.

తేజా సెటైర్లు

అదంతా చూసి ఓమైగాడ్ అన్న శుభ శ్రీ నామినేట్ చేసిన తర్వాత కూడానా అని నోరెళ్లబెట్టిసింది. రోటీని ప్రిన్స్ యావర్, రతిక ఒకరినొకరు ఒకే ప్లేట్‍లో తినిపించుకుంటూ రొమాన్స్ పండించారు. అదంతా చూసి కంటెస్టెంట్స్ అంతా షాక్ అయ్యారు. రతికలాగా పొదుపు నేర్చుకోవాలి. ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే ప్లేట్‍లో తింటే కడగటానికి ప్లేట్లు తగ్గిపోతాయి అని టేస్టీ తేజా సెటైర్ వేశాడు. ఇక మరోవైపు తన పవరాస్త్ర కొట్టిసిన వాళ్లపై శివాజీ తెగ ఫైర్ అయ్యాడు.

హీరో-విలన్

ఎవరైతే దీని వెనుక మాస్టర్ మైండ్ ఉన్నారో వాళ్ల తొక్క తీస్తా. తీసిన వాళ్లను ఏం అనను. కానీ, దీని వెనుక ఉన్న ఓవర్ యాక్షన్ వాళ్లను మాత్రం వదిలిపెట్టను. ఎవరైతే ఉన్నారో వాళ్లు నా చేతిలో చచ్చారే అని శివాజీ ఎవరితో చెప్పుకుంటా వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు దీని వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. ఆయన ఎన్ని రోజులు అంటాడో అనని. నేను రెడీ. ఒకవేళ అతను హీరో అయితే.. నేను విలన్ అవుతా అని ప్రియాంకతో అమర్ దీప్ అన్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.