Rashmika Remuneration: ఆ సీన్లు చేయడానికే రష్మిక భారీ రెమ్యునరేషన్ తీసుకుందా?-rashmika remuneration for animal is huge because of kiss scenes says a rumour ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Remuneration: ఆ సీన్లు చేయడానికే రష్మిక భారీ రెమ్యునరేషన్ తీసుకుందా?

Rashmika Remuneration: ఆ సీన్లు చేయడానికే రష్మిక భారీ రెమ్యునరేషన్ తీసుకుందా?

Hari Prasad S HT Telugu

Rashmika Remuneration: ఆ సీన్లు చేయడానికే రష్మిక భారీ రెమ్యునరేషన్ తీసుకుందంటూ ఓ కొత్త రూమర్ తెరపైకి వచ్చింది. యానిమల్ మూవీలో రష్మిక రెచ్చిపోయి కిస్ సీన్లలో నటించిన విషయం తెలిసిందే.

రష్మిక మందన్నా (Instagram)

Rashmika Remuneration: రష్మిక మందన్నా మెల్లగా బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. అక్కడ ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఆమె.. తాజాగా స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తో కలిసి యానిమల్ మూవీ చేస్తోంది. అయితే ఈ సినిమా కోసం రష్మిక భారీ రెమ్యునరేషన్ తీసుకుందని, అది కూడా కిస్ సీన్లలో నటించడానికే అంటూ ఓ బాలీవుడ్ పోర్టల్ రాసిన న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ మధ్యే యానిమల్ మూవీ నుంచి హువా మై అనే వీడియో సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ సాంగ్ లో రణ్‌బీర్ తో కలిసి ఆమె రెండు, మూడు హాట్ కిస్ సీన్లలో నటించింది. ఈ కిస్ సీన్లు వైరల్ అయ్యాయి. గతంలో గీత గోవిందంలాంటి సినిమాల్లో విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక కిస్ సీన్లలో నటించినా.. ఇప్పుడు యానిమల్ లో మాత్రం ఒకే పాటలో రెచ్చిపోయి లిప్ లాక్ సీన్లు చేసింది.

దీంతో ఈ కిస్ సీన్లలో నటించడానికి రష్మిక.. భారీ మొత్తం వసూలు చేసినట్లు బాలీవుడ్ లో పుకార్లు మొదలయ్యాయి. కానీ రష్మిక టీమ్ మాత్రం ఈ పుకార్లను ఖండించింది. ఆ కిస్ సీన్లను కథకు అనుగుణంగా చేసిందని, వాటి కోసం ప్రత్యేకంగా ఆమె ఏమీ ఛార్జ్ చేయలేదని తెలిపింది. ప్రస్తుతం తాను ప్రతి సినిమాకు ఎంత వసూలు చేస్తోందో అంతే చేసినట్లు కూడా వెల్లడించింది.

ఈ యానిమల్ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమాను మించి హాట్ సీన్లతో యానిమల్ ను కూడా నింపేశాడా అన్న అనుమానం ఈ పాటతో కలుగుతోంది.