Rashmika Vijay Deverakonda: విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. దొరికిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్
Rashmika Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మందన్నా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుందా? దొరికిపోయిందంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ అదే నిజమంటున్నాయి.
Rashmika Vijay Deverakonda: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి దీపావళి జరుపుకున్నారా? రష్మిక నేరుగా విజయ్ ఇంటికే వెళ్లి అతని ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుందా? ఆదివారం (నవంబర్ 12) ఈ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు, విషెస్ చెప్పిన తీరు ఇదే నిజమంటున్నాయి.
మొదట రష్మిక మందన్నా ఇన్‌స్టాలో దీపావళి విషెస్ చెప్పింది. సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఓ బెంచ్‌పై కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. హ్యాపీ దివాలీ మై లవ్స్ అనే క్యాప్షన్ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికే విజయ్ దేవరకొండ కూడా తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ఫొటోలను షేర్ చేశాడు. అతడు కూడా హ్యాపీ దివాలీ మై లవ్స్ అనే క్యాప్షన్ తోనే ఈ ఫొటోలు షేర్ చేయడం విశేషం.
ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా? రష్మిక ఫొటోపై స్పందిస్తూ.. నువ్వు విజయ్ ఇంట్లోనే ఉన్నావ్ కదా అనే కామెంట్స్ చేశారు. రష్మిక బ్యాక్‌గ్రౌండ్ లో ఉన్న గోడలను చూపిస్తూ.. విజయ్ ఇంటి గోడల్లాగే ఉన్నాయి.. అంటే అతనితో కలిసే రష్మిక దీపావళి సెలబ్రేట్ చేసుకుంటోందని ఫిక్సయ్యారు. ఇక ఇద్దరూ ఒకే రకంగా విష్ చేయడాన్ని కూడా ఫ్యాన్స్ ప్రస్తావిస్తున్నారు.
మై లవ్స్ అంటే విజయ్ అన్నే కదా అని ఓ అభిమాని రష్మిక పోస్ట్ పై కామెంట్ చేయడం విశేషం. ఇటు విజయ్ పోస్టులపైనా ఫ్యాన్స్ ఇలాగే స్పందిస్తున్నారు. సేమ్ ప్లేస్, సేమ్ బ్యాక్‌గ్రౌండ్, సేమ్ క్యాప్షన్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు. నిజానికి గతేడాది కూడా ఈ ఇద్దరూ కలిసే దీపావళి జరుపుకున్నారంటూ ఫ్యాన్స్ ఇలాగే కామెంట్స్ చేశారు.
ఇద్దరూ కలిసి గీతగోవిందం సినిమాలో నటించినప్పటి నుంచే రష్మిక, విజయ్ మధ్య ఏదో నడుస్తోందన్న పుకార్లు మొదలయ్యాయి. అయితే వీళ్లు మాత్రం ఎప్పుడూ బయటపడలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రష్మిక ఇటు పుష్ప 2తోపాటు అటు బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ తో కలిసి యానిమల్ మూవీ కూడా చేస్తోంది.
విజయ్ విషయానికి వస్తే లైగర్, ఖుషీ ఫ్లాపుల తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ నుంచి ఈ మధ్యే ఓ గ్లింప్స్ వీడియో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం అతడు రెడీ అవుతున్నాడు.