Rashmika Mandanna Hattrick: మూడేళ్లు.. మూడు బ్లాక్‍బస్టర్లు.. రష్మిక జోష్.. లైనప్ కూడా ఇంట్రెస్టింగ్‍గా..
Rashmika Mandanna Hat-trick: రష్మిక మందన్నా.. బ్లాక్‍బస్టర్ హిట్లతో ముందుకు సాగుతున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో టాప్ హీరోయిన్ ప్లేస్‍కు చేరారు. మూడేళ్లలో వరుసగా మూడు సూపర్ హిట్స్ సాధించారు. ఆ వివరాలివే..

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. వరుసగా భారీ సక్సెస్‍లు చూస్తున్నారు. అందంతో పాటు యాక్టింగ్ పర్ఫార్మెన్సులతో మెప్పిస్తూ మరింత క్రేజ్ పెంచేసుకున్నారు. ముఖ్యంగా గత మూడేళ్లలో వరసగా మూడు బ్లాక్‍బస్టర్లను ఈ బ్యూటీ దక్కించుకున్నారు. అందులోనూ ఆ సూపర్ హిట్ చిత్రాల్లో ఆమె నటనకు భారీగా ప్రశంసలు దక్కాయి. అద్భుతమైన పర్ఫార్మర్ అంటూ రష్మికకు కితాబు దక్కేసింది. ఆ వివరాలు ఇవే..
హ్యాట్రిక్ బ్లాక్‍బస్టర్స్
యానిమల్ చిత్రంలో రణ్‍బీర్ కపూర్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటించారు. 2023 డిసెంబర్‌లో రిలీజైన ఆ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఆ సినిమా ఆ ఏడాది అత్యధిక వసూళ్ల చిత్రంగా నిలిచింది. యానిమల్ మూవీలో రష్మిక మందన్నా నటనతో అదరగొట్టారు. ఎమోషనల్ సీన్లలో వావ్ అనిపించారు. కోపంగా రణ్‍బీర్‌తో చెప్పే లెంతీ డైలాగ్‍లు ఆమెలోని అద్భుత నటిని బయటికి తీసుకొచ్చాయి. యానిమల్‍తో తన సామర్థ్యమేంటో మరోసారి చూపించారు రష్మిక. ఆ చిత్రం రూ.900కోట్లకు పైగా వసూళ్లతో బంపర్ హిట్ కొట్టింది.
పుష్ప 2: ది రూల్‍లో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా నటించారు. 2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డులను తిరగరాసేసింది. పుష్ప 1 కంటే సీక్వెల్ పుష్ప 2లో రష్మిక యాక్టింగ్‍కు ఎక్కువ ప్రశంసలు దక్కాయి. శ్రీవల్లి పాత్రను ఆమె తప్ప ఎవరూ పోషించలేరనే ముద్రవేసేశారు. యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ ఇలా అన్ని విభాగాల్లో అదరగొట్టారు నేషనల్ క్రష్. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 చిత్రం రూ.1850కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసింది.
లేటెస్ట్‌గా ఛావా
ఛావా చిత్రం గత వారం ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైంది. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీలో ఛత్రపతి సంబాజీ మహరాజ్‍గా విక్కీ కౌశల్ నటించగా.. ఆయన భార్య యెసుభాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు. మహారాణి పాత్రలో రాజసంతో హుందాగా నటించారు. ఈ చిత్రంలో విక్కీతో పాటు రష్మిక నటనకు కూడా భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ఆ పాత్రకు తగ్గట్టుగా హావభావాలను రష్మిక బాగా పడించారు. ఛావా చిత్రం ఇప్పటికే రూ.120కోట్ల మార్క్ దాటిపోయింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ దిశగా సాగుతోంది.
ఇలా మూడేళ్లలో వరుసగా మూడు బ్లాక్‍బస్టర్లతో హ్యాట్రిక్ సాధించేశారు రష్మిక. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‍లో స్టార్ హీరోయిన్ రేంజ్‍కు చేరారు. ఓ బాలీవుడ్ హీరోయిన్‍కు కూడా లేనంత సక్సెస్ రేటుతో ముందుకు సాగుతున్నారు.
ఇంట్రెస్టింగ్‍గా లైనప్
రష్మిక సినిమాల లైనప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో రష్మిక కీలకపాత్ర పోషించారు. ఈ మూవీ నుంచి వచ్చిన లుక్, టీజర్ ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. సికిందర్ చిత్రంలో సల్మాన్ ఖాన్‍కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. ఫీమేల్ ఓరియెంటెడ్ తెలుగు మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ కూాడా రష్మిక చేస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి థామా చిత్రం కూడా ఆమె లైనప్‍లో ఉంది. ఇలా రష్మిక తదుపరి ప్రాజెక్టులు కూడా చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. తన కాలికి గాయపడ్డానని, షూటింగ్‍లకు కాస్త బ్రేక్ తీసుకోవాల్సి వస్తుందని రష్మిక ఇటీవల చెప్పారు. త్వరలోనే ఆమె మళ్లీ షూటింగ్‍ల్లో పాల్గొననున్నారు.
సంబంధిత కథనం