Rashmika Mandanna: సల్మాన్‌ఖాన్‌తో రష్మిక మందన్న రొమాన్స్ - ఇద్దరి మధ్య 30 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ - నెటిజన్ల ట్రోల్స్
Rashmika Mandanna: యానిమల్ తర్వాత బాలీవుడ్‌లో రష్మిక మందన్న మరో భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సికందర్ మూవీలో సల్మాన్ ఖాన్‌తో రొమాన్స్ చేయబోతున్నది. ఈ కాంబోపై కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తోన్నారు.
Rashmika Mandanna: యానిమల్ మూవీతో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందుకున్నది రష్మిక మందన్న, రణభీర్‌కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 900 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. యానిమల్ హిట్‌తో బాలీవుడ్‌లో రష్మికకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. తాజాగా ఈ కూర్గ్ బ్యూటీ హిందీలో ఓ బంపరాఫర్‌ను అందుకున్నది. సల్మాన్ ఖాన్‌తో రొమాన్స్ చేయబోతున్నది.

సికందర్‌లో...
సల్మాన్‌ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికందర్ పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా ఫిక్సైంది. సికందర్‌లో హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరును మేకర్స్ గురువారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న ఆన్‌స్క్రీన్ మ్యాజిక్‌ను 2025 ఈద్‌కు థియేటర్ల్‌లో చూడటం కోసం ప్రేక్షకులతో పాటు తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ మూవీ టీమ్ ట్వీట్ చేసింది
రష్మిక హ్యాపీ...
సల్మాన్ ఖాన్ మూవీలో అవకాశం దక్కడంపై రష్మిక కూడా రియాక్ట్ అయ్యింది. తన నెక్స్ట్ మూవీ అప్‌డేట్ ఏదని చాలా రోజులుగా అందరూ అడుగుతున్నారని, వారికి నేను ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్ ఇదే. సికంగర్‌లో భాగం కావడం ఆనందంగా, గర్వంగా ఉందని రష్మిక ట్వీట్ చేసింది. త్వరలోనే సికందర్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది.
నెటిజన్ల ట్రోల్స్...
సల్మాన్‌ఖాన్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకున్న రష్మిక మందన్నను ఫ్యాన్స్ అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఈ కాంబోపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
సల్మాన్ సరసన హీరోయిన్‌గా రష్మిక అస్సలు సెట్టవ్వదని కామెంట్స్ చేస్తోన్నారు. సల్మాన్‌కు చెల్లిలా రష్మిక కనిపిస్తుందని, ఇదేం కాంబో అని విమర్శిస్తోన్నారు. ఇద్దరి మధ్య 30 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ ఉంటుందని, ఓల్డ్ సల్మాన్, యంగ్ రష్మిక అంటూ రకరకాల కామెంట్స్ చేస్తోన్నారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
పుష్ప 2లో...
ప్రస్తుతం తెలుగులో పుష్ప 2లో హీరోయిన్‌గా నటిస్తోంది రష్మిక మందన్న. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. పుష్ప పార్ట్ వన్ బిగ్గెస్ట్ సక్సెస్ కావడంతో ఈ సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి.
పుష్ప 2 మూవీ పాన్ ఇండియన్ లెవల్‌లో రిలీజ్ కాబోతోంది. పుష్పతో పాటు తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది రష్మిక. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. అలాగే ధనుష్ హీరోగా నటిస్తోన్నకుబేరలో రష్మిక కథానాయికగా కనిపిస్తోంది. ఈ బైలింగ్వల్ మూవీలో నాగార్జున కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.