Rashmika Mandanna: కత్రీనా కైఫ్ భర్తకు తెలుగు నేర్పించిన రష్మిక మందన్నా- చివరిలో విక్కీ కౌశల్ ట్విస్ట్- వీడియో వైరల్
Rashmika Mandanna Teach Telugu To Vicky Kaushal In Chhaava Promotions: రష్మిక మందన్నా, కత్రీనా కైఫ్ భర్త విక్కీ కౌశల్ జంటగా నటించిన సినిమా ఛావా. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చారిత్రక డ్రామా సినిమా హైదరాబాద్ ప్రమోషన్స్‌లో విక్కీ కౌశల్‌కు రష్మిక తెలుగు నేర్పించింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Rashmika Mandanna Teach Telugu To Vicky Kaushal: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప 2 ది రూల్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఛావా. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ భర్త విక్కీ కౌశల్ హీరోగా నటించాడు. రష్మిక మందన్నా, విక్కీ కౌశల్ జంటగా నటించిన ఛావా సినిమా ప్రమోషన్స్ కోసం శుక్రవారం (జనవరి 31) హైదరాబాద్‌కు వచ్చారు.

రష్మికకు థ్యాంక్స్ చెప్పిన విక్కీ
ఛావా చిత్రంలోని 'జానే తు' అనే పాట లాంచ్ సమయంలోనే రష్మిక మందన్నా.. విక్కీ కౌశల్‌కు తెలుగు నేర్పించింది. తెలుగు ప్రేక్షకులతో ఎలా మాట్లాడాలో, సినిమా గురించి ఏం చెప్పాలో నిర్దేశించింది. దీనికి సంబంధించి వీడియోను తాజాగా విక్కీ కౌశల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఛావా మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌కు సంబంధించిన ఈ వీడియోలను పోస్ట్ చేసిన విక్కీ కౌశల్ తనకు తెలుగు నేర్పినందుకు రష్మికకు ధన్యవాదాలు తెలిపాడు.
చివరిలో విక్కీ ట్విస్ట్-రష్మిక సర్‌ప్రైజ్
ఈ వీడియోలో "అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా. నేను నేడు హైదరాబాద్‌కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఫిబ్రవరి 14కి వచ్చి సినిమా చూడండి. సపోర్ట్ చేయండి" అని రష్మిక చెప్పినట్లుగానే విక్కీ కౌశల్ చెప్పాడు. కానీ, చివరిలో సపోర్ట్ చేయండి అనేటప్పుడు ఎప్పుడు రష్మిక చేసే లవ్ సిగ్నేచర్ ఇచ్చాడు. దాంతో రష్మిక కూడా సర్‌ప్రైజ్ అయి నవ్వేసింది.
క్యూట్‌గా వీడియో
రెండు చేతి వేళ్లతో హార్ట్ సింబల్‌ను చూపించే సిగ్నేచర్ ఇచ్చాడు విక్కీ కౌశల్. అది చూసి అంతా క్లాప్స్ కొట్టారు. ఈ వీడియో, తెలుగులో విక్కీ కౌశల్ తెలుగులో మాట్లాడటం చాలా క్యూట్‌గా ఉంది. ఇక ఈ వీడియో షేర్ చేసిన విక్కీ కౌశల్ “మై టీచర్.. ప్రతి మాట అర్థవంతంగా ఉంది. ధన్యవాదాలు హైదరాబాద్” అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఇందులో టీచర్ అంటూ గురువు అని చెప్పుకొచ్చాడు విక్కీ.
ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా
ఇదిలా ఉంటే, బాలీవుడ్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా సినిమా పీరియాడికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రానుంది. మరాఠా మహారాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చారిత్రక యాక్షన్ చిత్రం శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల ఛావా ఆధారంగా తీశారు.
ఫిబ్రవరి 14కి వాయిదా
దినేష్ విజన్ మాడక్ ఫిల్మ్స్ పతాకంపై ఛావా చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా కూడా నటించాడు. ఛావా చిత్రీకరణ 2023లో ప్రారంభమై 2024లో ముగిసింది. ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛావా సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఫిబ్రవరి 14కి వాయిదా వేశారు. దీంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్