నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల ఎంగేజ్‌మెంట్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇటు సౌత్, అటు బాలీవుడ్‌లో వీరిద్ది నిశ్చితార్థంపై అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే, ఎంగేజ్‌మెంట్ విషయంపై విజయ దేవరకొండ, రష్మిక అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.
అయితే, తాజాగా రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియో షేర్ చేసింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రష్మిక మందన్నా తన పెట్ (పెంపుడు కుక్క) ఆరాతో ఆడుకుంటూ కనిపించింది. అయితే, ఈ క్రమంలోనే రష్మిక మందన్నా చేతి వేలికి ఓ డైమండ్ రింగ్ తళుక్కుమంటూ మెరిసింది.
పెంపుడు కుక్కను రష్మిక మందన్నా ముద్దు చేస్తున్న సమయంలో చాలా సార్లు ఆ డైమండ్ రింగ్ కనిపించింది. ఆ డైమండ్ రింగ్ నిశ్చితార్థపు ఉంగరమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఎంగేజ్‌మెంట్ గురించి ఓపెన్‌గా చెప్పని రష్మిక మందన్నా ఇలా ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చిదంటున్నారు నెటిజన్స్.
డైరెక్ట్ చెప్పకుండా విజయ్ దేవరకొండతో జరిగిన ఎంగేజ్‌మెంట్ రింగ్ గ్లింప్స్‌ను రష్మిక మందన్నా షేర్ చేసిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే, కంగ్రాచ్యులేషన్స్ అంటూ రష్మికకు నెటిజన్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఆ వీడియోలో థామా సినిమాలోని పాటను తన పెట్‌కు చూపిస్తుంది రష్మిక.
ఆ వీడియోకు "ఆ పాటతో నేను ప్రేమలో పడిపోయాను. నాతోపాటు ఆరా (పెంపుడు కుక్క) కూడా వైబ్ అవుతోందా? ఆ స్క్రీన్‌పై ఉన్నది నేనే అని తనకు తెలిస్తే కచ్చితంగా కన్‌ఫ్యూజ్ అవుతుంది. తను మాట్లాడితే చాలా బాగుండేది. లేదా ఈ పాటను పాడిన పర్వాలేదు" అని తన పెంపుడు కుక్క గురించి క్యాప్షన్ రాసుకొచ్చింది రష్మిక మందన్నా.
ఇదిలా ఉంటే, ఇటీవల రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత సన్నిహితులు మధ్య వారి నిశ్చితార్థం జరిగినట్లు టాక్. ఇకపోతే ఫిబ్రవరిలో విజయ్ రష్మికల వివాహానికి ముహుర్తం పెట్టినట్లు సమాచారం.
సంబంధిత కథనం