Rashmika Mandanna on Rishabh Shetty: మొత్తానికి దిగొచ్చిన రష్మిక.. రిషబ్, రక్షిత్‌లపై ప్రశంసలు-rashmika mandanna on rishabh shetty and rakshit says they paved the way for her in industry ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rashmika Mandanna On Rishabh Shetty And Rakshit Says They Paved The Way For Her In Industry

Rashmika Mandanna on Rishabh Shetty: మొత్తానికి దిగొచ్చిన రష్మిక.. రిషబ్, రక్షిత్‌లపై ప్రశంసలు

Hari Prasad S HT Telugu
Jan 18, 2023 08:31 PM IST

Rashmika Mandanna on Rishabh Shetty: మొత్తానికి దిగొచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. వరుసగా వస్తున్న ట్రోల్స్ కు చెక్ పెడుతూ.. కన్నడ హీరోలు రిషబ్, రక్షిత్‌లపై ప్రశంసలు కురిపించింది.

రష్మిక మందన్నా
రష్మిక మందన్నా (PTI)

Rashmika Mandanna on Rishabh Shetty: రష్మిక మందన్నా.. ప్రస్తుతం టాలీవుడ్ తోపాటు బాలీవుడ్, కోలీవుడ్ లలోనూ మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో ఓ రేంజ్ కు వెళ్లిన రష్మిక ఈ మధ్యే బాలీవుడ్ లో గుడ్ బై మూవీతో అరంగేట్రం చేసింది. తన రెండో మూవీ మిషన్ మజ్నూ రిలీజ్ కోసం చూస్తుండగా.. యానిమల్ అనే మరో మూవీ కూడా చేస్తోంది.

అయితే ఇన్ని ఇండస్ట్రీస్ లో మంచి స్థాయికి వెళ్లిన రష్మిక.. తన మూలాలను మరచిపోయేలా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తనను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిల పేర్లను ఓ ఇంటర్వ్యూలో నేరుగా ప్రస్తావించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత తాను కాంతారా సినిమా చూడలేని ఆమె చెప్పడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

కాంతారా చూడలేదని చెప్పిన తర్వాత రష్మికపై ట్రోలింగ్స్ పెరిగాయి. అయితే తాజాగా మరో ఇంటర్వ్యూలో రష్మిక కాస్త దిగొచ్చినట్లు కనిపిస్తోంది. కిర్రాక్ పార్టీ సినిమాతో సినీ ఇంస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక.. ఆ మూవీలో తనకు ఛాన్సిచ్చిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిల పేర్లను ప్రస్తావిస్తూ వాళ్ల వల్లే ఇప్పుడు తాను నాలుగు ఇండస్ట్రీల్లో ఈ స్థాయిలో ఉన్నట్లు చెప్పడం విశేషం.

నిజానికి ఇంతకుముందే కాంతారా మూవీ విషయంలోనూ రష్మిక ఇలాగే స్పందించింది. తాను ఈ సినిమా చూశానని, సంబంధిత వ్యక్తులకు తాను మెసేజ్ కూడా చేసినట్లు ఆమె చెప్పింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి కూడా రష్మిక స్పందించింది. ఈ ట్రోల్స్ తనను బాధ పెట్టకపోయినా.. తన 8 ఏళ్ల సోదరిని ఇవి చాలా ప్రభావితం చేస్తున్నట్లు తెలిపింది.

"ఈ ట్రోల్స్ కారణంగా మా 8 ఏళ్ల సోదరి చాలా బాధపడుతోంది. ట్రోల్స్ ను నేను సీరియస్ గా తీసుకోను. కానీ మా సోదరి, ఇతర కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. అందుకే నేను ట్రోల్స్ కు వ్యతిరేకంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను" అని రష్మిక చెప్పింది.

WhatsApp channel

సంబంధిత కథనం