Rashmika Mandanna: నేషనల్ క్రష్‌లాంటి ట్యాగ్స్ వల్ల టికెట్లు అమ్ముడుపోవు: రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rashmika Mandanna: రష్మిక మందన్నా తనకు ఉన్న నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి స్పందించింది. ఆమె నటించిన ఛావా మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 14) రిలీజ్ కానున్న నేపథ్యంలో పీటీఐతో మాట్లాడింది. ఈ ట్యాగ్స్ కేవలం ట్యాగ్స్ మాత్రమే అని ఆమె అభిప్రాయపడింది.

Rashmika Mandanna: రష్మిక మందన్నా.. ఇప్పుడో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. యానిమల్, పుష్ప రెండు పార్ట్ లతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పటికే నేషనల్ క్రష్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్న ఆమె.. తాజాగా ఆ ట్యాగ్ పై స్పందించింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ ట్యాగ్స్ వల్ల టికెట్లు అమ్ముడుపోవని అనడం గమనార్హం.
నేషనల్ క్రష్ ట్యాగ్‌పై రష్మిక
ఛావా మూవీ రిలీజ్ సందర్భంగా పీటీఐతో రష్మిక మాట్లాడింది. "ఇలాంటి ట్యాగ్స్ కెరీర్లో ఏమీ తోడ్పడవు. అవి కేవలం అభిమానుల ప్రేమ నుంచే వస్తాయి. వాళ్లు అలా పిలవాలనుకుంటారు.. పిలుస్తారు..
కానీ ఈ ట్యాగ్స్ కేవలం ట్యాగ్స్ మాత్రమే. మనం చేసే సినిమాలు, ప్రేక్షకుల ప్రేమే వాళ్లు కొనే టికెట్ల రూపంలోకి మారతాయి. అదే నాకు ప్రత్యేకం" అని రష్మిక అభిప్రాయపడింది.
హిందీ, తెలుగు మధ్య జర్నీపై..
ఇటు తెలుగు, అటు హిందీ సినిమాల్లో రష్మిక బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. దీనిపైనా రష్మిక స్పందించింది. ఇప్పుడిది తనకో సవాలుగా మారిందని ఆమె అభిప్రాయపడింది. "నిజాయతీగా చెప్పాలంటే ఇప్పుడో ఈవెంట్ సౌత్ లో, మరొకటి హిందీలో ఒకే సమయానికి అయితే నాకు కష్టమే.
కానీ అన్ని ప్రాంతాల నుంచి నాకు లభించిన ప్రేమను చూస్తుంటే.. నా నిద్రను త్యాగం చేసి అన్ని ఈవెంట్స్ కవర్ చేయాలనిపిస్తుంది. నేనెప్పుడూ ప్రేక్షకులే ప్రాధాన్యం ఇస్తాను. వాళ్ల ప్రేమే నాకు ముఖ్యం. అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. అందుకే రెండు, మూడు సినిమాలు ఒకే సమయంలో చేయగలుగుతున్నాను. రెండు షిఫ్ట్ లు చేసినా సరే అనిపిస్తుంది" అని రష్మిక చెప్పింది.
ఛావా మూవీ గురించి..
రష్మిక మందన్నా.. విక్కీ కౌశల్ తో కలిసి ఛావా మూవీలో నటించింది. శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబుతో తలపడిన గొప్ప చక్రవర్తి ఆయన. ఈ సినిమాలో విక్కీ కౌశల్ ఆయన పాత్రలో నటించాడు.
లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో శంభాజీ భార్య యేసుబాయి పాత్రలో ఆమె నటించింది. ఈ సినిమాపై రష్మిక స్పందించింది. "అసలు ఈ మూవీ నా దగ్గరికి వస్తుందని అనుకోలేదు. ఇదో గొప్ప అవకాశం. కొన్ని నెలల పాటు భాషపై పట్టు సాధించడానికి ప్రయత్నించాను. మేం ఎలా అనుకున్నామో అలాగే వచ్చిందీ సినిమా" అని రష్మిక చెప్పింది.
సంబంధిత కథనం