Goodbye Movie OTT Release Date: ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ డెబ్యూ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌ -rashmika mandanna debut bollywood movie goodbye ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rashmika Mandanna Debut Bollywood Movie Goodbye Ott Release Date Locked

Goodbye Movie OTT Release Date: ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ డెబ్యూ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 24, 2022 02:00 PM IST

Goodbye Movie OTT Release Date: ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ డెబ్యూ మూవీ గుడ్‌బై ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఎప్ప‌టినుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

అమితాబ్‌బ‌చ్చ‌న్‌, ర‌ష్మిక మంద‌న్న‌
అమితాబ్‌బ‌చ్చ‌న్‌, ర‌ష్మిక మంద‌న్న‌

Goodbye Movie OTT Release Date: గుడ్‌బై సినిమాతో బాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది ర‌ష్మిక మంద‌న్న‌. అమితాబ్‌బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకు వికాస్ భ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అక్టోబ‌ర్ 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. తాజాగా గుడ్‌బై ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. డిసెంబ‌ర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఆధునిక జీవ‌న‌శైలి, ఆర్థిక సంబంధాలు మ‌నుషుల మ‌ధ్య దూరాన్ని ఎలా పెంచుతున్నాయ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు వికాస్ భ‌ల్ గుడ్ బై సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో అమితాబ్‌బ‌చ్చ‌న్ కూతురిగా ర‌ష్మిక మంద‌న్న క‌నిపించింది. లాయ‌ర్ పాత్ర‌లో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది. తొలుత బాలీవుడ్‌లో మిష‌న్ మ‌జ్ను సినిమాపై సంత‌కం చేసింది ర‌ష్మిక మంద‌న్న‌. కానీ మొద‌ట గుడ్‌బై సినిమా విడుద‌లైంది.

గుడ్‌బై సినిమాతో ప‌రాజ‌యం పాలైన ర‌ష్మిక‌కు మాత్రం బాలీవుడ్‌లో క్రేజ్ భారీగానే ఉంది. ప్ర‌స్తుతం ర‌ణ్‌బీర్‌క‌పూర్‌తో యానిమ‌ల్ సినిమా చేస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

యానిమ‌ల్ షూటింగ్‌తో ర‌ష్మిక మంద‌న్న బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే తెలుగులో పుష్ప -2 షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్నాడు. పుష్ప పార్ట్ 1 పెద్ద విజ‌యాన్ని సాధించ‌డంతో పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో పుష్ప సీక్వెల్‌పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.