Vijay Rashmika: విజయ్ దేవరకొండతో పెళ్లిని కన్ఫమ్ చేసిన రష్మిక.. అభిమానికి ఇచ్చిన రిప్లై వైరల్-rashmika mandanna confirms her marriage with vijay deverakonda her reply to a fan gone viral tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rashmika Mandanna Confirms Her Marriage With Vijay Deverakonda Her Reply To A Fan Gone Viral Tollywood News

Vijay Rashmika: విజయ్ దేవరకొండతో పెళ్లిని కన్ఫమ్ చేసిన రష్మిక.. అభిమానికి ఇచ్చిన రిప్లై వైరల్

Hari Prasad S HT Telugu
Feb 28, 2024 09:02 AM IST

Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కచ్చితంగా రిలేషన్షిప్ లో ఉన్నారని ఎంతోకాలంగా అభిమానులు ఫిక్సయినా.. వాళ్లు మాత్రం బయటపడలేదు. అయితే తాజాగా రష్మిక మరోసారి పరోక్షంగా తమ మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టింది.

విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా తన పెళ్లిని కన్ఫమ్ చేసినట్లేనా?
విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా తన పెళ్లిని కన్ఫమ్ చేసినట్లేనా?

Vijay Rashmika: విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా తన పెళ్లిని దాదాపు కన్ఫమ్ చేసినట్లేనా? సోషల్ మీడియాలో ఓ అభిమానికి ఆమె ఇచ్చిన రిప్లై చూసి ఫ్యాన్స్ అదే ఫిక్సయిపోయారు. తనకు VD (విజయ్ దేవరకొండ)లాంటి అబ్బాయే మొగుడిగా రావాలని రష్మిక కోరుకుంటున్నట్లు తేలిపోయింది. ఈ లవ్ బర్డ్స్ తమ మధ్య బంధాన్ని నేరుగా బయటపెట్టకపోయినా.. తరచూ ఇలాంటి హింట్స్ ఇస్తూనే ఉన్నారు.

రష్మిక చెప్పేసినట్లేనా?

రష్మిక మందన్నా తాజాగా ఓ ఫ్యాన్ పేజ్ లో చేసిన పోస్టుకు రిప్లై ఇచ్చింది. ఓ అభిమాని రష్మిక ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి రష్మికకు భర్తగా వస్తే బాగుంటుందని అడిగారు. "రష్మిక మందన్నాకు భర్తగా వచ్చే అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఆమె నేషనల్ క్రష్. అందుకే ఆమె భర్త స్పెషల్ గా ఉండాలి. ఆమె భర్త VD లాగా ఉండాలి. అంటే వెరీ డేరింగ్. ఆమెను ఎప్పుడూ కాపాడే వాడై ఉండాలి. ఆమెను రాణి అంటాం. అందుకే ఆమె భర్త రాజై ఉండాలి" అని పోస్ట్ చేశారు.

దీనిపై రష్మిక మందన్నా స్పందించింది. అది చాలా నిజం అని ఆమె కామెంట్ చేయడం విశేషం. ఇక్కడ ఆ అభిమాని వీడీ అంటూ పరోక్షంగా విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించినట్లు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెరీ డేరింగ్ అంటూ కవర్ చేసినా.. ఆ అభిమాని ఉద్దేశమేంటో అర్థం చేసుకోవచ్చని మిగతా ఫ్యాన్స్ అంటున్నారు. దీనికి రష్మిక నిజమే అని రిప్లై ఇవ్వడంతో ఇక విజయ్ తో తన పెళ్లిని ఆమె కన్ఫమ్ చేసినట్లే అని ఫిక్సయ్యారు.

నోరు మెదపని రష్మిక, విజయ్

సోషల్ మీడియాలో తమ రిలేషన్షిప్ పై ఇంతలా వార్తలు వస్తున్నా.. అటు రష్మికగానీ, ఇటు విజయ్ గానీ దీనిపై నోరు మెదపలేదు. అయితే ఫిబ్రవరిలోనే వీళ్ల ఎంగేజ్ మెంట్ అని వచ్చిన వార్తలపై మాత్రం గతంలో ఒకసారి విజయ్ స్పందించాడు. "నేను ప్రతి రెండేళ్లకోసారి పెళ్లి చేసుకోవాలని మీడియా భావిస్తున్నట్లుంది. ఈ పుకారు నేను ప్రతి ఏడాది వింటాను. నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానా అని మీడియా ఎదురు చూస్తోంది" అని విజయ్ అన్నాడు.

అటు రష్మిక అయితే ఎప్పుడూ దీనిపై స్పందించలేదు. ఈ మధ్యే యానిమల్ మూవీతో హిట్ కొట్టిన ఆమె.. తర్వాత పుష్ప 2, ది గర్ల్‌ఫ్రెండ్, చావాలాంటి సినిమాలతో బిజీగా గడుపుతోంది. అటు విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ మూవీ ఫ్యామిలీ స్టార్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇక దీని తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో విజయ్ మరో సినిమా చేస్తున్నాడు.

రష్మిక ఈ మధ్యే ఇటలీ వెళ్లింది. అక్కడి ఫ్యాషన్ వీక్ లో ఆమె బ్లాక్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసింది. ఆ తర్వాత అదే బ్లాక్ డ్రెస్ లో ఫొటో షూట్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

WhatsApp channel