Rashmika Mandanna: బాక్సాఫీస్ క్వీన్.. రెండేళ్లు.. మూడు సినిమాలు.. రూ.3300 కోట్ల కలెక్షన్లు.. రష్మిక మందన్నా జోరు-rashmika mandanna box office queen three movies collected 3300 crores world wide in 2 years ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna: బాక్సాఫీస్ క్వీన్.. రెండేళ్లు.. మూడు సినిమాలు.. రూ.3300 కోట్ల కలెక్షన్లు.. రష్మిక మందన్నా జోరు

Rashmika Mandanna: బాక్సాఫీస్ క్వీన్.. రెండేళ్లు.. మూడు సినిమాలు.. రూ.3300 కోట్ల కలెక్షన్లు.. రష్మిక మందన్నా జోరు

Hari Prasad S HT Telugu
Published Mar 13, 2025 03:55 PM IST

Rashmika Mandanna: రష్మిక మందన్నా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ క్వీన్. ఆమె రెండేళ్లలో నటించిన మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.3300 కోట్లు వసూలు చేయడం విశేషం. బాలీవుడ్ టాప్ హీరోయిన్లను కూడా ఆమె వెనక్కి నెట్టింది.

బాక్సాఫీస్ క్వీన్.. రెండేళ్లు.. మూడు సినిమాలు.. రూ.3300 కోట్ల కలెక్షన్లు.. రష్మిక మందన్నా జోరు
బాక్సాఫీస్ క్వీన్.. రెండేళ్లు.. మూడు సినిమాలు.. రూ.3300 కోట్ల కలెక్షన్లు.. రష్మిక మందన్నా జోరు

Rashmika Mandanna: రష్మిక మందన్నా ఇప్పుడు కొత్త ఇండియన్ బాక్సాఫీస్ క్వీన్. గత మూడేళ్లలో ఆమె నటించిన మూడు సినిమాలే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించినవి కావడం విశేషం. మూడు సినిమాలు కలిపి రూ.3300 కోట్లు వసూలు చేశాయి. దీపికా పదుకోన్, ఆలియా భట్, ప్రియాంచా చోప్రాలాంటి స్టార్ బాలీవుడ్ హీరోయిన్లను ఆమె వెనక్కి నెట్టడం విశేషం.

రష్మిక మందన్నా.. బాక్సాఫీస్ క్వీన్

రష్మిక మందన్నా 2023 చివర్లో యానిమల్ మూవీలో, గతేడాది పుష్ప 2 మూవీలో, ఈ ఏడాది ఛావాలో మూడు భిన్నమైన పాత్రలు పోషించింది. ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. గత 16 నెలల్లో ఆమె నటించిన మూడు సినిమాలు కలిపి ఏకంగా రూ.3300 కోట్లు వసూలు చేశాయి.

కేవలం హిందీ వెర్షన్ వసూళ్లు చూసుకున్నా.. రష్మిక ఈ మధ్యకాలంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. ఆమె నటించిన యానిమల్ మూవీ హిందీలో రూ.503 కోట్లు, పుష్ప 2 హిందీలో రూ.812 కోట్లు, ఛావా హిందీలో రూ.532 కోట్లు వసూలు చేశాయి. మొత్తంగా కేవలం హిందీలోనే ఈ మూడు సినిమాలు కలిపి రూ.1850 కోట్లు వసూలు చేయడం విశేషం.

బాలీవుడ్ స్టార్లను వెనక్కి నెట్టి..

రష్మిక మందన్నా అంటే తెలుగులోనూ పెద్ద నటి. కానీ గడిచిన మూడేళ్లలో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడామె టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ క్వీనే. కొన్నేళ్ల కిందట ప్రియాంకా చోప్రా బాలీవుడ్ లో టాప్ నటిగా పేరుగాంచింది. ఆమె హాలీవుడ్ కు వెళ్లిపోయిన తర్వాత దీపికా పదుకోన్ కొన్నేళ్లుగా బాక్సాఫీస్ ను ఏలుతోంది. ఇప్పుడు రష్మిక రూపంలో ఆమెకు గట్టి పోటీయే ఎదురైంది.

కత్రినా, ఆలియాలాంటి వాళ్లు ఎన్నో ఏళ్లుగా టాప్ స్పాట్ కోసం ఎదురు చూస్తుండగా.. రష్మిక మాత్రం ఈ మూడు సినిమాలతోనే ఎక్కడికో వెళ్లిపోయింది. 2023 నుంచి దీపికా పదుకోన్ 5 సినిమాల్లో నటించి రూ.1800 కోట్లు వసూలు చేసింది. ఆమె మాత్రమే రష్మికకు కాస్త దగ్గరగా ఉండగా.. మిగిలిన వాళ్లు అసలు ఊసులోనే లేరు.

ఈ ఏడాది కూడా ఊపు మీదే..

రష్మిక మందన్నా 2023లో యానిమల్, 2024లో పుష్ప 2తో తిరుగులేని విజయాలు అందుకుంది. ఈ ఏడాది ఇప్పటికే ఛావాతో సక్సెస్ అందుకుంది. ఇదే కాదు.. ఈ ఏడాది మరిన్ని బ్లాక్ బస్టర్ గా నిలవగలిగే మూవీస్ రాబోతున్నాయి. అందులో ఒకటి సల్మాన్ ఖాన్ తో కలిసి ఆమె నటిస్తున్న మూవీ సికందర్.

రంజాన్ కు రాబోతున్న ఈ సినిమా కూడా రికార్డులను తిరగరాయడం ఖాయం. ఇక ఆ తర్వాత నాగార్జున, ధనుష్ లతో కలిసి శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న కుబేర కూడా రాబోతోంది. ఇవే కాకుండా ది గర్ల్‌ఫ్రెండ్ లోనూ ఆమె నటిస్తోంది. దీంతో ఈ ఏడాది రష్మిక జోరు మరింత ఎక్కువగా ఉండనుంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం