విజయ్ దేవరకొండ పేరు వినగానే సిగ్గుపడ్డ రష్మిక.. అతని నుంచి అన్నీ తీసుకుంటానని కామెంట్.. మరోసారి వీళ్ల రిలేషన్ పై చర్చ-rashmika mandanna blushed when asking about vijay devarakonda at kubera pre release event love story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  విజయ్ దేవరకొండ పేరు వినగానే సిగ్గుపడ్డ రష్మిక.. అతని నుంచి అన్నీ తీసుకుంటానని కామెంట్.. మరోసారి వీళ్ల రిలేషన్ పై చర్చ

విజయ్ దేవరకొండ పేరు వినగానే సిగ్గుపడ్డ రష్మిక.. అతని నుంచి అన్నీ తీసుకుంటానని కామెంట్.. మరోసారి వీళ్ల రిలేషన్ పై చర్చ

రష్మిక మందన్న: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఎంతో కాలం నుంచి జోరుగా సాగుతోంది. వీళ్ల ఫొటోలు, వీడియోలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. తాజాగా కుబేర ప్రి రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ పేరు వినగానే రష్మిక సిగ్గు పడటం వైరల్ గా మారింది.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్ షిప్ లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకే చోటు నుంచి వీళ్ల ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇంటర్వ్యూల్లో ఒకరి గురించి మరొకరు చెప్తూ హింట్ ఇస్తూనే ఉంటారు. తాజాగా కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన్న కామెంట్లు మరోసారి విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ కు బలాన్ని చేకూర్చింది. విజయ్ పేరు వినగానే రష్మిక సిగ్గుపడింది.

సుమ ప్రశ్నలు

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించినప్పటి నుండి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకే ప్రదేశం నుండి చిత్రాలను పోస్ట్ చేయడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. అయితే వారిద్దరూ దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ కుబేర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, విజయ్ గురించి అడగగానే రష్మిక పెద్దగా నవ్వి సిగ్గుపడింది. ఈ ఈవెంట్ లో రష్మికను యాంకర్ సుమ కొన్ని ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగారు.

హీరోల క్వాలిటీస్

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ ప్రశ్నలకు రష్మిక సమాధానమిచ్చింది. డబ్బుతో కుటుంబం, సంతోషాన్ని కొనలేమని ఆమె చెప్పింది. అయితే సుమ కొంతమంది హీరోల పేర్లు చెప్పి, వాళ్ల నుంచి ఎలాంటి క్వాలిటీస్ కాపీ చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. నాగార్జున గురించి అడిగినప్పుడు, అతని ఆకర్షణ, తేజస్సును కాపీ చేయాలనుకుంటున్నానని రష్మిక చెప్పింది. ధనుష్ నటన, దర్శకత్వం, నృత్యం వంటి ప్రతీది చేయగల సామర్థ్యం కావాలంది. అల్లు అర్జున్ 'స్వాగ్' కూడా కావాలని రష్మిక చెప్పింది.

అన్నీ తీసుకుంటా

ఇక విజయ్ దేవరకొండ గురించి సుమ అడిగినప్పుడు రష్మిక ముఖం వెలిగిపోయింది. ఆమె సిగ్గుపడి, ముఖంలో చిరునవ్వుతో ఆగి.. "అన్నీ, అన్నీ తీసుకుంటాను" అని చెప్పడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. విజయ్ క్వాలిటీస్ లో అన్నీ కావాలని రష్మిక అలా చెప్పింది. దీంతో విజయ్, రష్మిక లవ్ లో ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. రష్మిక గత కొన్నేళ్లుగా విజయ్ ఇంటి నుండి చిత్రాలు, వీడియోలను కూడా పోస్ట్ చేసింది,

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జునతో కలిసి కుబేరలో రష్మిక యాక్ట్ చేసింది. ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఆమె తమ్మ, ది గర్ల్‌ఫ్రెండ్‌లో కూడా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్‌డమ్‌ సినిమాతో విజయ్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ జూలై 4న విడుదల కానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం