Rashmika Mandanna: నడుముకు గన్, చేతిలో కత్తితో రష్మిక మందన్నా.. వారియర్‌గా బర్త్ డే పోస్టర్ అదుర్స్!-rashmika mandanna birthday poster released from the girlfriend and vijay devarakonda singing song reyi lolothula release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna: నడుముకు గన్, చేతిలో కత్తితో రష్మిక మందన్నా.. వారియర్‌గా బర్త్ డే పోస్టర్ అదుర్స్!

Rashmika Mandanna: నడుముకు గన్, చేతిలో కత్తితో రష్మిక మందన్నా.. వారియర్‌గా బర్త్ డే పోస్టర్ అదుర్స్!

Sanjiv Kumar HT Telugu

The Girlfriend Rashmika Mandanna Birthday Poster Released: రష్మిక మందన్నా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ది గర్ల్‌ఫ్రెండ్. హీరో, నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ నుంచి రష్మిక మందన్నా బర్త్ డే పోస్టర్ రిలీజ్ అయింది. రష్మిక బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.

నడుముకు గన్, చేతిలో కత్తితో రష్మిక మందన్నా.. వారియర్‌గా బర్త్ డే పోస్టర్ అదుర్స్!

The Girlfriend Rashmika Mandanna Birthday Poster Released: నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక మందన్నా హిందీలో ఛావా మూవీతో మరో హిట్ అందుకుంది.

నేషనల్ క్రష్ తెలుగు మూవీ

ఆ తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన జతకట్టి సికిందర్ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించింది రష్మిక మందన్నా. ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ చేస్తున్న మరో తెలుగు సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఈ సినిమాలో హీరోగా దసరా, టచ్ మీ నాట్ ఓటీటీ వెబ్ సిరీస్ ఫేమ్ దీక్షిత్ శెట్టి చేస్తున్నాడు.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో

ఇక హీరో, నటుడు, డైరెక్టర్ అయిన రాహుల్ రవీంద్రన్ ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.

రష్మిక మందన్నా బర్త్ డే సందర్భంగా

బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా ఏప్రిల్ 5న రష్మిక మందన్నా బర్త్ డే సందర్భంగా ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. రష్మిక మందన్నాకు ది గర్ల్‌ఫ్రెండ్ టీమ్ విషెస్ చెబుతూ కొత్త పోస్టర్, టీజర్ సాంగ్ 'రేయి లోలోతుల' రిలీజ్ చేశారు.

వారియర్‌గా రష్మిక మందన్నా

ది గర్ల్‌ఫ్రెండ్ పోస్టర్‌లో రష్మిక మందన్నా వారియర్ లుక్‌లో గన్, కత్తితో పవర్ ఫుల్‌గా కనిపించింది. చేతిలో పెద్ద కత్తి పట్టుకున్న రష్మిక మందన్నా నడుము చుట్టూ గన్ పెట్టుకుని ఉంది. మంచు కొండల మధ్య ఒక వారియర్‌లా రష్మిక మందన్నా దర్శనం ఇచ్చింది. ఈ రష్మిక మందన్నా బర్త్ డే పోస్టర్ అదిరిపోయింది. దాంతో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

పాట పాడిన విజయ్ దేవరకొండ

అలాగే, ది గర్ల్‌ఫ్రెండ్ నుంచి రిలీజ్ చేసిన 'రేయి లోలోతుల' పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించారు. హీరో విజయ్ దేవరకొండ, హేషమ్ అబ్దుల్ వాహబ్, చిన్మయి శ్రీపాద ఆకట్టుకునేలా పాడారు. ఈ పాటలో వచ్చే పోయెమ్‌ను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రాశారు.

రేయి లోలోతుల సాంగ్

'రేయి లోలోతుల' పాట ఎలా ఉందో చూస్తే- 'రేయి లోలోతుల సితార, జాబిలి జాతర, కన్నులలో వెన్నెలలే కురిసే, మదిమోసే తలవాకిట తడిసే, యెద జారెనే మనసు ఊగెనే, చెలి చెంతలో జగమాగెనే, యెద జారెనే మనసా..' అంటూ మంచి లవ్ ఫీల్‌తో సాగుతుందీ పాట. ఇదిలా ఉంటే, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం