Rashmi in Maldives: మాల్దీవ్స్ స్విమ్మింగ్ పూల్‌లో హాట్ బ్యూటీ రష్మి.. వీడియో వైరల్
Rashmi in Maldives: మాల్దీవ్స్ స్విమ్మింగ్ పూల్‌లో హాట్ బ్యూటీ రష్మి గౌతమ్ ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను రష్మియే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Rashmi in Maldives: ఈ మధ్య సెలబ్రిటీలందరికీ మాల్దీవ్స్ బెస్ట్ హాలిడే డెస్టినేషన్‌గా మారిపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీలైతే ఆ దేశానికి క్యూ కట్టారు. తాజాగా తెలుగు హాట్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఆ సెలబ్రిటీల రూట్‌లోనే వెళ్లింది. ప్రస్తుతం ఆమె కూడా మాల్దీవ్స్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తోంది. స్విమ్మింగ్ పూల్‌లో తాను ఉన్న వీడియోను రష్మి ఇన్‌స్టాలో అభిమానులతో షేర్ చేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి తన హాట్‌హాట్ డ్రెస్సులు, క్యూట్ క్యూట్ స్మైల్స్‌తో కట్టిపడేస్తుంది రష్మి. వచ్చీరాని తెలుగులో ఆమె మాట్లాడే తీరు కూడా చాలా మందిని ఆకర్షిస్తుంది. ఆ అందం అప్పుడప్పుడూ సిల్వర్ స్క్రీన్‌పై కూడా తళుక్కున మెరుస్తుంటుంది. ఆ మధ్య గుంటూర్ టాకీస్‌లో మన డీజే టిల్లుతో తెగ రొమాన్స్ చేసిన ఆమె.. ఈ మధ్యే బొమ్మ బ్లాక్‌బస్టర్ అంటూ నందూతోనూ నటించింది.
ఇక ఇప్పుడు తన బిజీ ప్రొఫెషనల్ లైఫ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తోంది. 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాట్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో రష్మి స్విమ్మింగ్ పూల్‌లో ఉండటం చూడొచ్చు. "ఒకసారి వాటర్ బేబీగా మారితే ఇక ఎప్పుడూ వాటర్ బేబీగానే ఉంటుంది" అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ ఈ వీడియోను ఆమె షేర్ చేసింది.
ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రష్మి సముద్ర అందాలను చూస్తూ ఉండగా.. మెల్లగా వెనుక నుంచి కెమెరా ఆమె వైపు వస్తూ ఉంటుంది. దగ్గరికి రాగానే ఆమె నీటిలోకి వెళ్లిపోయి రెండు చేతులను మాత్రం పైకి ఉంచుతూ హార్ట్ సింబల్‌ను చూపిస్తుంది. బ్లూ టూపీస్ బికినీలో రష్మి బ్యాక్ మాత్రమే ఈ వీడియోలో చూడొచ్చు.
జలకన్యలాగా ఉన్నావంటూ ఈ వీడియో చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. లక్షల కొద్దీ లైక్స్, వందల కామెంట్స్ వచ్చాయి. ఇక చాలా మంది ఫ్యాన్స్ హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు.