Romantic Action OTT: ఓటీటీలోకి వచ్చిన రన్యారావు కోలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ మూవీ - ఫ్రీగా సినిమా చూసేయండి!
Romantic Action OTT: రన్యారావు హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ వాఘా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా హిందీ వెర్షన్ జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. వాఘా తమిళ వెర్షన్ మాత్రం యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. వాఘా మూవీలో విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు.

Romantic Action OTT: కన్నడ నటి రన్యారావు హీరోయిన్‌గా నటించిన తమిళ మూవీ వాఘా సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. వాఘా మూవీలో విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. 2016లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. ఈ సినినమాకు జీఎన్ఆర్ కుమరవేలన్ దర్శకత్వం వహించాడు.
హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్...
థియేటర్లలో రిలీజైన తొమ్మిదేళ్ల తర్వాత వాఘా హిందీ వెర్షన్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ వెర్షన్ మాత్రం ఫ్రీగా యూట్యూబ్‌లోఅందుబాటులో ఉంది. వాఘా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్...
వాఘా మూవీపై రిలీజ్‌కు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా థియేటర్లలో ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. వాఘా మూవీతోనే రన్యా రావు హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఖనుమ్, కాజల్ అనే రెండు పాత్రల్లో కనిపించింది.
వాఘా కథ ఇదే...
ఖనుమ్ పాకిస్థాన్‌కు చెందిన అమ్మాయి. తన తాతయ్యను చూడటానికి ఇండియా వస్తుందివస్తుంది. వాసు అనే సోల్జర్‌తో ప్రేమలో పడుతుంది. ఇండియా , పాకిస్థాన్ మధ్య గొడవల కారణంగా ఖనుమ్ తిరిగి మాతృదేశానికి వెళ్లడం కష్టంగా మారుతుంది. ప్రియురాలిని పాకిస్థాన్ చేరవేసే బాధ్యతను వాసు తీసుకుంటాడు. ఈ జర్నీలో ఏం జరిగింది? ఖనుమ్ పాకిస్థాన్‌లోని తన ఇంట్లో అడుగుపెట్టిందా? పాకిస్థాన్ సైనికులకు బందీగా చిక్కిన వాసు జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? వాసును చంపాలని రజాక్ అలీ ఖాన్ ఎందుకు అనుకున్నాడు అన్నదే వాఘా మూవీ కథ.
కన్నడంలో రెండు సినిమాలు...
కన్నడ మూవీ మాణిక్యతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రన్యారావు. ఈ మూవీలో కిచ్చా సుదీప్ హీరోగా నటించాడు. ప్రభాస్ మిర్చి మూవీకి రీమేక్‌గా మాణిక్య తెరకెక్కింది. ఆ తర్వాత కన్నడంలో పటాకీ అనే సినిమా చేసింది రన్యారావు. పటాస్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
బంగారం స్మగ్లింగ్...
బంగారం అక్రమ రవాణా కేసులో ఇటీవల రన్యారావును పోలీసులు అరెస్ట్ చేశారు. తరుచుగా దుబాయ్ వెళుతున్న రన్యారావు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల తనిఖీల్లో రన్యారావు వద్ద 12 కోట్ల బంగారం దొరకడం చర్చనీయాంశంగా మారింది. వీఐపీ ప్రోటోకాల్‌ను అడ్డుపెట్టుకొని అక్రమంగా ఈ బంగారం తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. రన్యారావు బంగారం స్మంగ్లింగ్ వెనుకు పలువురు రాజకీయ నాయకులు, అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. రన్యారావు సవతి తండ్రి ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం.
సంబంధిత కథనం