Telugu News  /  Entertainment  /  Ranveer Singh Collaborating With Hollywood Star For Action Mini Series
రణ్‌వీర్ సింగ్
రణ్‌వీర్ సింగ్ (AFP)

Ranveer Singh: హాలీవుడ్‌పై కన్నేసిన రణ్‌వీర్.. యాక్షన్ స్టార్‌తో మినీ సిరీస్..!

27 July 2022, 11:43 ISTMaragani Govardhan
27 July 2022, 11:43 IST

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ హాలీవుడ్‌లో ఓ మినీ వెబ్‌ సిరీస్ చేయబోతున్నారట. ఫిల్మ్ వర్గాల సమచార ప్రకారం ఓ ప్రముఖ హాలీవుడ్ సూపర్ స్టార్ ఇందులో నటించబోతున్నారట. త్వరలోనే ఈ సిరీస్ సెట్స్‌పైకి వెళ్లనుంది.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇటీవలే పేపర్ మ్యాగజైన్‌లో న్యూడ్ చిత్రంతో దర్శనమిచ్చి సంచలనం రేపిన విషయం తెలిసిందే. వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ హీరో తను ఎంచుకునే కథల విషయంలోనూ అంతే ఉంటాడు. అందుకే ఆనతి కాలంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా హాలీవుడ్‌పై కన్నేశాడు గల్లీ బాయ్. బీటౌన్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఓ హాలీవుడ్ స్టార్‌తో కలిసి యాక్షన్ అడ్వెంచర్ సిరీస్ చేయబోతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

ఓ ప్రముఖ హాలీవుడ్ సూపర్ స్టార్‌తో కలిసి రణ్‌వీర్ సింగ్ భారీ యాక్షన్, హై బడ్జెట్ మినీ సిరీస్‌లో నటించనున్నాడట. బాలీవుడ్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్న రణ్‌వీర్ హాలీవుడ్‌లో ఆఫర్ దక్కించుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యమేమి లేదు. ఓ భారీ యాక్షన్ మినీ సిరీస్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే అతడు చేయబోయే హాలీవుడ్ నటుడు ఎవరనేది ఇంకా స్పష్టత లేదు.

ఈ ప్రాజెక్టు వీలైనంత త్వరగానే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుంత రణ్‌వీర్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్. కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రాలు చేస్తున్నాడు. ఇది కాకుండా శంకర్ దర్శకత్వంలో చేయనున్న అపరిచితుడు రీమేక్ కూడా ఈ వరుసలో ఉంది. అందరూ అగ్ర దర్శకులే కావడంతో రణ్‌వీర్ చేయబోతున్న హాలీవుడ్ సిరీస్‌కు డేట్లు ఎలా కేటాయిస్తాడనేది అనుమానంగా ఉంది.

ఇటీవల రణ్‌వీర్ నగ్న చిత్రంతో సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారమే రేపాడు. పేపర్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన న్యూడ్ ఫొటో షూట్‌తో సర్వత్ర చర్చనీయాంశమయ్యాడు. కొంతమంది అతడిపై సానుకూలంగా స్పందించగా.. మరికొంతమంది మాత్రం వ్యతిరేకతను తెలుపుతున్నారు. రణ్‌వీర్ ఇలాంటి ఫొటో షూట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.