రాను బొంబయికి రాను సాంగ్ లిరిక్స్.. యూట్యూబ్‌లో 22 కోట్ల వ్యూస్.. లెక్కలేనన్ని రీల్స్, ఇప్పటికీ టాప్ ట్రెండింగ్-ranu bombai ki ranu song lyrics a folk song creates sensation in youtube with more than 22 crore views ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  రాను బొంబయికి రాను సాంగ్ లిరిక్స్.. యూట్యూబ్‌లో 22 కోట్ల వ్యూస్.. లెక్కలేనన్ని రీల్స్, ఇప్పటికీ టాప్ ట్రెండింగ్

రాను బొంబయికి రాను సాంగ్ లిరిక్స్.. యూట్యూబ్‌లో 22 కోట్ల వ్యూస్.. లెక్కలేనన్ని రీల్స్, ఇప్పటికీ టాప్ ట్రెండింగ్

Hari Prasad S HT Telugu

రాను బొంబయికి రాను అంటూ సాగిపోయే ఓ జానపద పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 22 కోట్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. లెక్కలేనంత మంది రీల్స్ చేశారు. ఇప్పటికీ మ్యూజిక్‌ వీడియో ట్రెండింగ్ టాప్ 2లో ఉన్న ఈ సాంగ్ లిరిక్స్ చూసేయండి.

రాను బొంబయికి రాను సాంగ్ లిరిక్స్.. యూట్యూబ్‌లో 22 కోట్ల వ్యూస్.. లెక్కలేనన్ని రీల్స్, ఇప్పటికీ టాప్ ట్రెండింగ్

రాను బొంబయికి రాను.. ఇదేమీ బ్లాక్‌బస్టర్ సినిమా పాట కాదు. పాడినోళ్లు, మ్యూజిక్ కంపోజ్ చేసినోళ్లు టాలీవుడ్ లోని టాప్ సెలబ్రిటీలు కాదు. కానీ ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి 23న రిలీజైన ఈ సాంగ్.. ఇప్పటికీ 22 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ మ్యూజిక్ వీడియో ట్రెండింగ్ టాప్ 2లో ఉండటం విశేషం. మరి ఈ పాట విశేషాలు, లిరిక్స్ ఏంటో ఇక్కడ చూడండి.

రాను బొంబాయికి రాను సాంగ్ గురించి..

రాను బొంబయికి రాను అనే ఆల్బమ్ నుంచే వచ్చిన పాట ఇది. రాము రాథోడ్ ఈ పాటకు లిరిక్స్ అందించడంతోపాటు మరో సింగర్ ప్రభతో కలిసి పాడాడు. కల్యాణ్ కీస్ మ్యూజిక్ అందించాడు. శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాట, అందులోని లిరిక్స్, డ్యాన్స్ స్టెప్స్ అన్నీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

మూడున్నర నెలలుగా యూట్యూబ్ ను దున్నేస్తోందీ పాట. కేవలం రూ.5 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ పాట.. మేకర్స్ పై కాసుల వర్షం కురిపించింది. మంచి బీట్, లిరిక్స్, స్టెప్స్ ఉంటే చిన్న పాటనైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ సాంగ్ మంచి నిదర్శనం.

రాను బొంబాయికి రాను సాంగ్ లిరిక్స్ ఇవే..

అద్దాలా మేడలున్నయే

మేడల్లా మంచి సీరలున్నాయే

సీరంచు రైకలున్నాయే

కొనిపిస్తా నాతో బొంబయి రాయే

రాను.. నే రాను..

రాను బొంబయికి రాను

రాను బొంబయికి రాను

రాను బొంబయికి రాను

రాను బొంబయికి రాను

రాయే రాయే పిల్ల

రంగులరాట్నం ఎక్కించి జాతరంతా జూపిత్తా..

రాను రాను పొలగా

రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జేత్తవంట..

అందుకే రాను.. నే రాను

ఆ రాను గా జాతర రాను

రాను నేనాగం గాను

రాను గా జాతర నేను

రాను నేనాగం గాను

చరణం 1

మల్లెపల్లిలా మల్లె తోటనే

నీ జడలా పూలు అల్లి పెడతనే

నల్లగొండలా నెక్కిలేసులే

నీ మెడలా భలే మెరిసిపోతయే

సాలు అయ్యా సాలు

సాలు నీ జూట మాటలు

సాలు నీ కూలే కోటలు

సాలు నీ జూట మాటలు

సాలు నీ కూలే కోటలు

రాయే రాయే పిల్ల

నీ కంటి మీద రెప్పనయ్యి కడదాకా తోడుంటా

రాను రాను పొలగా

మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా

అందుకే రాను ఎహే రా నే రాను

ఆ రాను గా జాతర రాను

రాను నేనాగం గాను

రాను గా జాతర నేను

రాను నేనాగం గాను

చరణం 2

పల్లెటూరీ పడుచు పిల్లవే

పట్నమంతా నీ కంటగడతనే

మా పాలమూరి పంచ వన్నెవే

పైస కట్నం నేనొళ్ళనంటినే

అయినా రాను నే రాను

రాను గా హైదరబాదు

నా పానమీడికెళ్లి యాడికోదు

నే రాను గా హైదరబాదు

నా పానమీడికెళ్లి యాడికోదు

రాయే రాయే పిల్ల

రచ్చమాని సచ్చిపోని నా ప్రేమ చూడు గుండెల్లా

కానీ కానీ పొలగా

కచ్చెదించి ప్రేమవంచి అడుగైతా నీ అడుగుల్లా

సామీ నా సామీ

సామీ నా బంగరు సామీ

నే తెంపబోను నీకిచ్చిన హామీ

సామీ నా బంగారు సామీ

నే తెంపబోను నీకిచ్చిన హామీ

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం