Rangamarthanda OTT Platform: రంగమార్తాండ వచ్చేది ఈ ఓటీటీలోనే.. భారీ మొత్తానికి డిజిటల్ హక్కులు
Rangamarthanda OTT Platform: రంగమార్తాండ ఏ ఓటీటీలో రానుందో తేలిపోయింది. వచ్చే వారం థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
Rangamarthanda OTT Platform: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో వస్తున్న మూవీ రంగమార్తాండ. ఈ ఎమోషనల్ డ్రామాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ వచ్చే బుధవారం (మార్చి 22) థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంలాంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ సినిమా తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ను కూడా లాక్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. ఈ రంగమార్తాండ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించికున్నట్లు తెలుస్తోంది. హౌజ్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. ఈ మధ్యే అతడు స్వరపరచిన ఓ మంచి మెలోడీ సాంగ్ కూడా రిలీజైంది. "పువ్వై విరిసే ప్రాణం.. పండే మురిసే ప్రాయం.. రెండూ ఒకటే నాణానికి బొమ్మ బొరుసంతే" అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. రంగమార్తండ ఆత్మగీతంగా అభివర్ణించిన కృష్ణవంశీ ఈ పాటను తన ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా హృద్యంగా ఆలపించారు.
దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ కలం నుంచి రాలువాలిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఆయన తరహా సందేశాన్ని సాంగ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. 3 నిమిషాల 14 సెకన్ల నిడివి కలిగిన ఈ సాంగ్ లిరిక్స్ అందరినీ మెప్పిస్తోంది. బహుశా సిరివెన్నెల రాసిన చివరి పాట ఇదే కావచ్చు.
క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ మెగాఫోన్ పట్టి చాలా రోజులే అయింది. చివరగా ఆయన నక్షత్రం అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా వచ్చి ఆరేళ్లు కావస్తోంది. నిజానికి రంగమార్తండ కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. మరి చాలా కాలం తర్వాత వస్తున్న కృష్ణవంశీ తన మునుపటి మ్యాజిక్ చేస్తాడా లేదా చూడాలి.
సంబంధిత కథనం