Shamshera: రణ్‌బీర్ షంషేరా ట్రైలర్ వచ్చేసింది.. విజువల్స్ అదరహో..!
రణ్ బీర్ కపూర్ హీరోగా రూపొందిన తాజా చిత్రం షంషేరా. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సంజయ్ దత్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. జులై 22న విడుదల కానుందీ చిత్రం.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.. గత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మాస్త్రతో పాన్ఇండియా స్థాయిలో విడుదల చేయసేందుకు సిద్ధపడ్డాడు. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే షంషేరా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఇందులో రణ్‌బీర్ సరికొత్తగా కనిపించనున్నాడు. ఈ ట్రైలర్ గమనిస్తే.. రణ్‌బీర్ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడే ఓ తెగ నాయకుడిగా కనిపించాడు. గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ సన్నివేశాలు, అబ్బురపరిచే విజవల్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాలు బాహుబలిని తలపించేలా ఉన్నాయి. పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఇందులో రణ్‌బీర్ సరసన వాణికపూర్ నటించింది. ఆమెకు సంబంధించిన లుక్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్ లుక్ ఆసక్తికరంగా ఉంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కరణ్ మల్హోత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మిథున్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని జులై 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రణాళిక రూపొందించారు.
సంబంధిత కథనం
టాపిక్