Rashmika Mandanna: విజ‌య్‌ని ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ టైమ్ ఎక్క‌డ క‌లిసింది? -సీక్రెట్ రివీల్ చేసిన ర‌ణ్‌బీర్‌-ranbir kapoor reveals when did vijay devarakonda and rashmika mandanna meet for the first time ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranbir Kapoor Reveals When Did Vijay Devarakonda And Rashmika Mandanna Meet For The First Time

Rashmika Mandanna: విజ‌య్‌ని ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ టైమ్ ఎక్క‌డ క‌లిసింది? -సీక్రెట్ రివీల్ చేసిన ర‌ణ్‌బీర్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 24, 2023 11:40 AM IST

Rashmika Mandanna: విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్న ఫ‌స్ట్ టైమ్ ఎప్పుడు, ఎక్క‌డ క‌లుసుకున్న‌ది బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోలో ర‌ణ్‌బీర్ క‌పూర్ రివీల్ చేశాడు.విజ‌య్, అనుబంధం గురించి ఈ షోలో ర‌ణ్‌బీర్ క‌పూర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న,  సందీప్ వంగా
ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న, సందీప్ వంగా

Rashmika Mandanna: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ప్రేమ‌లో ఉన్న‌ట్లు చాలా కాలంగా టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తోన్నాయి. విజ‌య్ ఫ్యామిలీ ఈవెంట్స్‌లో ర‌ష్మిక మంద‌న్న క‌నిపించ‌డం, క‌లిసి టూర్స్‌కు వెళ్ల‌డం, సోష‌ల్ మీడియాలో ఒక‌రిపై మ‌రొక‌రు త‌ర‌చుగా ప్ర‌శంస‌లు కురిపించుకోవ‌డం చూసి వీరి ల‌వ్ స్టోరీ నిజ‌మేనంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్రేమ వార్త‌ల‌పై విజ‌య్‌, ర‌ష్మిక ఇప్ప‌టివ‌ర‌కు సెలైంట్‌గానే ఉంటూ వ‌చ్చారు. విజ‌య్‌, ర‌ష్మిక రిలేష‌న్‌షిప్‌పై బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్‌క‌పూర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. యానిమ‌ల్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్నతో పాటు సందీప్ వంగా హాజ‌ర‌య్యారు.

ట్రెండింగ్ వార్తలు

సందీప్ ఫోన్ కాల్‌...

ఈ షోలో విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్‌రెడ్డి, ర‌ణ్‌బీర్ క‌పూర్ యానిమ‌ల్ మూవీ పోస్ట‌ర్స్‌ను ర‌ష్మిక‌కు చూపించాడు ఇందులో ఎవ‌రి పోస్ట‌ర్ బాగుంద‌ని ర‌ష్మిక‌ను అడిగాడు బాల‌కృష్ణ‌. ఇద్ద‌రి పోస్ట‌ర్స్ బాగున్నాయ‌ని ర‌ష్మిక చెప్పిన స‌మాధానంతో బాల‌కృష్ణ సంతృప్తి చెంద‌లేదు. ఇలాంటి పొలిటిక‌ల్ డైలాగ్స్ వ‌ద్దు అంటూ ఆమెపై సెటైర్ వేశాడు. విజ‌య్‌కి ఫోన్ చేయ‌మ‌ని సందీప్ రెడ్డి వంగాకు చెప్పాడు బాల‌కృష్ణ‌. సందీప్ రెడ్డి ఫోన్ కాల్‌ను విజ‌య్ లిఫ్ట్ చేయ‌లేదు.

దాంతో ర‌ష్మిక ఫోన్ నుంచి చేస్తే విజ‌య్ త‌ప్ప‌కుండా లిఫ్ట్ చేస్తాడ‌ని ర‌ణ్‌బీర్‌క‌పూర్ చెప్పి ఆమెను ఇరికించాడు. ప‌ట్టుబ‌ట్టి ర‌ష్మిక ఫోన్‌ను తెప్పించాడు. ర‌ష్మిక ఫోన్ చేస్తుండ‌గా...విజ‌య్ పేరును ఆమె ఏమ‌ని ఫీడ్ చేసుకుందో చూడ‌టానికి ర‌ణ్‌బీర్‌క‌పూర్ ప్ర‌య‌త్నించాడు. కానీ ర‌ష్మిక మాత్రం అత‌డిని స్క్రీన్ చూపించ‌కుండా చేయి అడ్డం పెట్టింది.

బాల‌కృష్ణ జెల‌సీ…

ఆ త‌ర్వాత సందీప్ వంగా కాల్‌ను విజ‌య్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. కొద్దిసేపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో బాల‌కృష్ణ‌తో మాట్లాడాడు. ఆ త‌ర్వాత ఆ ఫోన్‌ను ర‌ష్మిక‌కు ఇచ్చాడు. ఫోన్ స్పీక‌ర్‌లో ఉంద‌ని విజ‌య్‌తో ర‌ష్మిక చెప్ప‌డం న‌వ్వుల‌ను పూయించింది. మీ ఇద్ద‌రి మాట‌లు చూసి బాల‌కృష్ణ జెల‌సీగా ఫీల‌వుతున్నాడ‌ని విజ‌య్‌తో అన్నాడు ర‌ణ్‌బీర్‌క‌పూర్‌. . ర‌ష్మిక ల‌వ్స్ బాల‌కృష్ణ ర‌ణ్‌బీర్ అన‌గా...విజ‌య్ ల‌వ్స్ అని బాల‌కృష్ణ అడిగాడు. ఆ ప్ర‌శ్న‌కు నేను సందీప్ వంగా ను ల‌వ్ చేస్తున్నాన‌ని విజ‌య్ స‌మాధానం చెప్పాడు.

ఆ స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఫ‌స్ట్ టైమ్ ర‌ష్మిక అర్జున్ రెడ్డి స‌క్సెస్ పార్టీలో క‌లిసింద‌ని, ఆ పార్టీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట్లోనే జ‌రిగింద‌ని ర‌ణ్‌బీర్‌క‌పూర్ సీక్రెట్ రివీల్ చేశాడు.ఆ పార్టీకి ర‌ష్మిక‌ను ఎవ‌రు ఇన్వైట్ చేశార‌ని బాల‌కృష్ణ అడిగాడు. ఈ ఇన్ఫ‌ర్మేష‌న్ ఎవ‌రు లీక్ చేస్తున్నారో త‌న‌కు తెలియ‌దు అని ర‌ష్మిక అన‌డం షోలో న‌వ్వుల‌ను పూయించింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.