Animal Trailer: యానిమ‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్-ranbir kapoor rashmika mandanna animal trailer release date fixed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Trailer: యానిమ‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Animal Trailer: యానిమ‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Nelki Naresh Kumar HT Telugu
Nov 20, 2023 02:05 PM IST

Animal Trailer: ర‌ణ్‌బీర్ క‌పూర్ యానిమ‌ల్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. న‌వంబ‌ర్ 23న ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు డైరెక్ట‌ర్ సందీప్ వంగా ప్ర‌క‌టించాడు.

ర‌ణ్‌బీర్ క‌పూర్, సందీప్ వంగా
ర‌ణ్‌బీర్ క‌పూర్, సందీప్ వంగా

Animal Trailer: ర‌ణ్‌బీర్ క‌పూర్ యానిమ‌ల్ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. న‌వంబ‌ర్ 23న యానిమ‌ల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు సందీప్ వంగా ప్ర‌క‌టించాడు. ఎదురుచూపుల‌కు త‌గ్గ‌ట్లుగా ట్రైల‌ర్ అద్భుతంగా ఉండ‌బోతున్న‌ట్లు సందీప్ వంగా తెలిపాడు. హిందీ, తెలుగుతో పాటు అన్ని భాష‌ల ట్రైల‌ర్స్‌ను ఒకే రోజు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిసింది.

యానిమ‌ల్ మూవీ డిసెంబ‌ర్ 1న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. తండ్రీకొడుకుల అనుబంధం నేప‌థ్యంలో క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా యానిమ‌ల్ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు సందీప్ వంగా. ఈ సినిమాలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. అనిల్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోండ‌గా...బాబీ డియోల్ విల‌న్ పాత్ర‌ను పోషిస్తోన్నాడు. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

యానిమ‌ల్ మూవీని తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ భాగంగా బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న‌తో పాటు సందీప్ వంగా పాల్గొన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ వంగా.ఈ సినిమాను క‌బీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు.

క‌బీర్ సింగ్ త‌ర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం అనంత‌రం సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది. యానిమ‌ల్ త‌ర్వాత ప్ర‌భాస్‌తో స్పిరిట్ మూవీ చేయ‌నున్నాడు సందీప్ వంగా.

IPL_Entry_Point