Animal Live Updates: యానిమల్ లైవ్ అప్డేట్స్.. నా చేయి వణుకుతుంది, డైరెక్టర్‌కు గట్టిగా కిస్ పెట్టాలి..-ranbir kapoor rashmika mandanna animal movie review and box office collections audience response live updates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranbir Kapoor Rashmika Mandanna Animal Movie Review And Box Office Collections Audience Response Live Updates

రణ్ బీర్ కపూర్ రష్మిక మందన్నా యానిమల్ మూవీ లైవ్ అప్డేట్స్

Animal Live Updates: యానిమల్ లైవ్ అప్డేట్స్.. నా చేయి వణుకుతుంది, డైరెక్టర్‌కు గట్టిగా కిస్ పెట్టాలి..

06:55 AM ISTSanjiv Kumar
  • Share on Facebook
06:55 AM IST

Animal Movie Live Updates: సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ యానిమల్ డిసెంబర్ 1న విడుదల అయింది. రణ్ బీర్ కపూర్‌, రష్మిక మందన్నా నటించిన యానిమల్ మూవీ లైవ్ అప్డేట్స్, ఆడియెన్స్ రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్, అడ్వాన్స్ బుకింగ్స్ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Fri, 01 Dec 202306:55 AM IST

సందీప్ రెడ్డికి కిస్ పెట్టాలని ఉంది

"థియేటర్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. నేను ఏం చూశానో అస్సలు నమ్మలేకపోతున్నాను. యానిమల్ మూవీ నాకు వణుకు పుట్టించింది. సందీప్ రెడ్డి వంగా ఏం చేశావ్. నాకైతై నీ దగ్గరికి వచ్చి గట్టిగా కిస్ పెట్టాలని ఉంది" అంటూ ఓ నెటిజన్ తన వణుకుతున్న చేతి వీడియోను షేర్ చేశాడు.

Fri, 01 Dec 202306:35 AM IST

యానిమల్ పై మీమ్స్

యానిమల్ సినిమాలోని వీడియోలపై మీమ్స్ వస్తున్నాయి. సినిమాలో తండ్రి అనిల్ కపూర్ తో రణ్ బీర్ తండ్రీకొడుకుల సీన్ రీక్రియేట్ చేద్దానేదానిపై మీమ్స్ దర్శనం ఇస్తున్నాయి. మిస్టర్ బీన్ వీడియోలతో ఫన్నీగా ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Fri, 01 Dec 202306:11 AM IST

నా అంత రాక్షసుడు లేడు

నా అంత రాక్షసుడు ప్రపంచంలోనే లేడు అంటూ రణ్ బీర్ కపూర్ శత్రువులపై గన్ ఫైర్ చేస్తున్న వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో యానిమల్ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది.

Fri, 01 Dec 202306:11 AM IST

గూస్ బంప్స్ తెప్పించేలే బీజీఎమ్

యానిమల్ సినిమాలో బీజీఎమ్ కు రణ్ బీర్ నడిచే విధానం గూస్ బంప్స్ తెప్పిస్తుందంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Fri, 01 Dec 202305:23 AM IST

ఇంటర్వెల్ సీన్

యానిమల్ మూవీ నుంచి ట్విటర్ లో వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. యానిమల్ ఇంటర్వెల్ బ్లాక్ సీన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Fri, 01 Dec 202305:02 AM IST

తొలి హిందీ సినిమాగా

రణ్ బీర్ కపూర్ యానిమల్ మూవీ నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లు సాధించిందని బుకింగ్స్ ద్వారా తెలిసింది. దీంతో నార్త్ అమెరికాలో పది లక్షలకుపైగా డాలర్లు కలెక్ట్ చేసిన తొలి హిందీ సినిమాగా యానిమల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Fri, 01 Dec 202304:40 AM IST

రణ్ బీర్-రష్మిక కిస్సింగ్ సీన్ వైరల్

యానిమల్ మూవీ నుంచి మరో వీడియో నెట్టింట్లో లీక్ అయింది. ఇందులో కుటుంబ సభ్యుల అందరి ముందు రష్మిక, రణ్ బీర్ కపూర్ లిప్ లాక్ చేసే సీన్ ఉంది. ఈ సీన్ చూసి ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Fri, 01 Dec 202304:22 AM IST

కన్నీళ్లు వస్తాయి

అర్జున్ రెడ్డి సినిమా ఒక టీజర్ అయితే, యానిమల్ ఫుల్ లెంత్ మూవీ అని ఓ ప్రేక్షకుడు చెప్పాడు. తండ్రీకొడుకుల మధ్య బాండింగ్ చాలా బాగా చూపించారు. రియల్ లైఫ్ లోని తండ్రీకొడుకులు చూస్తే వాళ్లకు కన్నీళ్లు వస్తాయని మరోకరు తెలిపారు.

Fri, 01 Dec 202304:06 AM IST

అర్జున్ రెడ్డి అమ్మ బాబులా

యానిమల్ పై తెలుగు ఆడియెన్స్ రివ్యూ ఇచ్చారు. అర్జున్ రెడ్డి అమ్మ బాబులా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. దానికిమించి ఉందని, అర్జున్ రెడ్డి పనికిరాదని చెబుతున్నారు. స్పిరిట్ ను సందీప్ రెడ్డి డైరెక్ట్ చేయడం పర్ఫెక్ట్ ఛాయిస్ అని పేర్కొన్నారు. ఇలాంటి సినిమాలు రావాలని అంటున్నారు.

Fri, 01 Dec 202303:49 AM IST

కర్నూల్ లో హవా

కర్నూల్ లో యానిమల్ మూవీ మేనియా నడుస్తోంది. ఉదయం ఆరు గంటల షోకే ప్రేక్షకులు బారులు తీరారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో గింగిరాలు తిరగుతోంది.

Fri, 01 Dec 202303:33 AM IST

మోస్ట్ వయెలెంట్ వీడియో

యానిమల్ సినిమా నుంచి మరో వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రణ్ బీర్ కపూర్ పెద్ద మెషీన్ గన్ తో విలన్స్ ను ఫైర్ చేయడం మోస్ట్ వయెలెంట్ గా కనిపించింది. ఇట్స్ ఫXX టైమ్ అంటూ ఓ నెటిజన్ ఈ వీడియో షేర్ చేశాడు.

Fri, 01 Dec 202303:06 AM IST

ఇంత వయెలెన్సా?

యానిమల్ సినిమాలోని వీడియోలను ట్విటర్ లో పోస్ట్ చేస్తున్నారు. క్లాస్ రూమ్ లో రణ్ బీర్ కపూర్ గన్ పట్టుకుని ఓ విద్యార్థికి వార్నింగ్ ఇచ్చే సీన్ అదిరిపోయింది. ఏంటీ సార్ ఇంత వయెలెన్సా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Fri, 01 Dec 202302:49 AM IST

యానిమల్‌కు 4 స్టార్ రేటింగ్

"2023లో యానిమల్ నా ఫేవరెట్ మూవీ. సినీ ప్రేక్షకులను యానిమల్ షాక్‌కు గురి చేస్తుంది. రణ్‌బీర్ కపూర్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ మూవీ అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని చెప్పిన ఉమర్ సంధు సినిమాకు 4 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.

Fri, 01 Dec 202302:37 AM IST

యానిమల్ ఫస్ట్ రివ్యూ

డిసెంబర్ 1న విడుదల కానున్న యానిమల్ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు సినీ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకునే ఉమర్ సంధు. యూత్‌ను విపరీతంగా అలరించే యాక్షన్ మూవీ. హై ఆక్టెన్ యాక్షన్, అడల్ట్ సీన్స్ థీమ్, హిట్ మ్యూజిక్, అదిరిపోయే స్క్రిప్ట్, నటీనటుల సూపర్బ్ యాక్టింగ్ సినిమాకు ప్రేక్షకులను తీసుకొస్తుంది అని ఉమర్ చెప్పాడు.

Fri, 01 Dec 202302:22 AM IST

యానిమల్ రన్ టైమ్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో ఉంది. ఇంతకుముందు ఆయన డైరెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాకు కూడా 3 గంటల 6 నిమిషాల రన్ టైమ్ ఉంది. అయినా, ప్రేక్షకులను తన సినిమా ఎంటర్టైన్ చేస్తుందని సందీప్ రెడ్డి ధీమాగా ఉన్నాడు.

Fri, 01 Dec 202302:20 AM IST

పిల్లలకు చూపించకండి

యానిమల్ మూవీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది పెద్దలు మాత్రమే చూడదగ్గ సినిమా అని తాను కూడా తన పిల్లలకు ఈ సినిమా చూపించను అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.

Fri, 01 Dec 202302:18 AM IST

కిస్సింగ్ సీన్స్

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌కు భారీ స్పందన వస్తోంది. అలాగే రణ్ బీర్, రష్మిక మందన్నా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని తెలుస్తోంది. ఘాటు కిస్సింగ్ సీన్లలో ఈ జోడీ రెచ్చిపోయింది.

Fri, 01 Dec 202302:17 AM IST

పవర్ ఫుల్ విలన్

యానిమల్ చిత్రంలో రష్మిక, రణ్ బీర్‌ కపూర్‌తోపాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో రణ్ బీర్‌కు అనిల్ కపూర్ తండ్రిగా నటించాడు. అలాగే పవర్ ఫుల్ విలన్ పాత్రలో బాబీ డియోల్ కనువిందు చేయనున్నాడు.

Fri, 01 Dec 202302:13 AM IST

నిర్మాతలు

యానిమల్ సినిమాతో రణ్ బీర్ కూపూర్, రష్మిక మందన్నా తొలిసారిగా జోడీ కట్టారు. యానిమల్ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.