Brahmastram Tv Premiere Date: బ్రహ్మాస్త్రం టీవీ ప్రీమియర్ డేట్ ఇదే - ఏ ఛానల్‌లో టెలికాస్ట్ కానుందంటే
Brahmastram Tv Premiere Date: రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బ్రహ్మాస్త్ర తెలుగు టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్సయింది. ఈ సినిమా ఏరోజు ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ కానుందంటే...
Brahmastram Tv Premiere Date: రియల్‌లైఫ్ కపుల్ రణ్‌బీర్‌కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీ తెలుగు టీవీ ప్రీమియర్ డేట్ ఖరారైంది. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ బాలీవుడ్ మూవీని దక్షిణాది భాషల్లో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ సౌత్ వెర్షన్స్‌కు అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ బ్రహ్మాస్త్రం స్టార్ మాలో ప్రీమియర్ కాబోతున్నది. మే 21న ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మాలో ఫస్ట్ తెలుగు ప్రీమియర్ టెలికాస్ట్ కాబోతున్నది. ఈ విషయాన్ని స్టార్ మా ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసింది.
బ్రహ్మాస్త్రం సినిమాలో నాగార్జున, అమితాబ్‌బచ్చన్, మౌనీరాయ్ కీలక పాత్రలను పోషించారు. తెలుగు వెర్షన్‌కు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 450 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రణ్‌భీర్ కపూర్, అలియాభట్ కెమిస్ట్రీతో పాటు యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్ అభిమానులను ఆకట్టుకొన్నాయి.
తెలుగు వెర్షన్ కూడా 30 కోట్ల వరకు కలెక్షన్స్ దక్కించుకొన్నది. తెలుగులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడ్ డబ్బింగ్ మూవీస్‌లో ఒకటిగా బ్రహ్మాస్త్రం నిలిచింది. బ్రహ్మాస్త్ర సినిమాను మొత్తం మూడు పార్ట్‌లుగా తెరకెక్కించబోతున్నారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 2...2026లో పార్ట్ -3 ...2027లో రిలీజ్ కానున్నాయి.