Animal First Look: మాస్ అవ‌తారంలో ర‌ణ్‌బీర్‌క‌పూర్ - యానిమ‌ల్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్-ranbir kapoor animal first look unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranbir Kapoor Animal First Look Unveiled

Animal First Look: మాస్ అవ‌తారంలో ర‌ణ్‌బీర్‌క‌పూర్ - యానిమ‌ల్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Nelki Naresh Kumar HT Telugu
Jan 01, 2023 09:34 AM IST

Animal First Look: న్యూ ఇయ‌ర్ రోజున మాస్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు ర‌ణ్‌బీర్‌క‌పూర్‌. ఆదివారం యానిమ‌ల్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ర‌ణ్‌బీర్‌క‌పూర్‌
ర‌ణ్‌బీర్‌క‌పూర్‌

Animal First Look: కొత్త ఏడాది రోజున మాస్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు ర‌ణ్‌బీర్‌క‌పూర్‌. అత‌డు హీరోగా న‌టిస్తోన్నయానిమ‌ల్ ఫ‌స్ట్ లుక్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో పూర్తిగా మాస్ అవ‌తారంలో ర‌ణ్‌బీర్‌క‌పూర్ క‌నిపిస్తున్నాడు. గొడ్డ‌లి ప‌ట్టుకొని సిగ‌రెట్ తాగుతూ ఇంటెన్స్‌గా ద‌ర్శ‌న‌మిచ్చాడు. గొడ్డ‌లిపై ర‌క్తం మ‌ర‌క‌లు ర‌ణ్‌బీర్‌క‌పూర్ ఒంటిపై గాయాలు ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది.

ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు ర‌ణ్‌బీర్ క‌పూర్ ఎక్కువ‌గా సాఫ్ట్ రోల్స్‌లోనే క‌నిపించాడు. పూర్తిస్థాయి మాస్ పాత్ర‌లో క‌నిపించ‌డం ఇదే మొద‌టిసారి. తండ్రీ కొడుకుల ఎమోష‌న్ ప్ర‌ధానంగా యానిమ‌ల్ సినిమా సాగ‌నున్న‌ట్లు స‌మాచారం.

యానిమ‌ల్ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. తొలుత ప‌రిణీతి చోప్రాను క‌థానాయిక‌గా తీసుకున్నారు. కానీ ఆమె డేట్స్ స‌ర్ధుబాటు కాక‌పోవ‌డంతో సినిమా నుంచి త‌ప్పుకుంది. ఆమె స్థానంలో ర‌ష్మిక మంద‌న్న‌ను క‌థానాయిక‌గా తీసుకున్నారు. అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆగ‌స్ట్ 11న యానిమ‌ల్ సినిమా రిలీజ్ కానుంది.

అర్జున్‌రెడ్డి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు సందీప్ వంగా. ధిక్కార మ‌న‌స్త‌త్వ‌మున్న యువ‌కుడి ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమా క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స్టార్ హీరోగా నిల‌బెట్టింది.

ఆ త‌ర్వాత అర్జున్‌రెడ్డి సినిమాను క‌బీర్‌సింగ్ పేరుతో షాహిద్ క‌పూర్‌తో రీమేక్ చేశాడు సందీప్ వంగా. అక్క‌డ కూడా మూడు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ రీమేక్ త‌ర్వాత అత‌డు యానిమ‌ల్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

WhatsApp channel