Unstoppable with NBK: అన్‍స్టాపబుల్ సెట్స్‌లో బాలకృష్ణతో రణ్‍బీర్ కపూర్.. వైరల్ అవుతున్న ఫొటో-ranbeer kapoor and nandamuri balakrishna photo leaked from sets of unstoppable with nbk sets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ranbeer Kapoor And Nandamuri Balakrishna Photo Leaked From Sets Of Unstoppable With Nbk Sets

Unstoppable with NBK: అన్‍స్టాపబుల్ సెట్స్‌లో బాలకృష్ణతో రణ్‍బీర్ కపూర్.. వైరల్ అవుతున్న ఫొటో

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 14, 2023 02:55 PM IST

Unstoppable with NBK: అన్‍స్టాపబుల్‍లో బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్నా సందడి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్‍స్టాపబుల్‍ షూటింగ్ కోసం రణ్‍బీర్ వచ్చారు. హోస్ట్ బాలకృష్ణతో రణ్‍బీర్ కలిసి దిగిన ఫొటో బయటికి వచ్చింది.

బాలకృష్ణ, రణ్‍బీర్ కపూర్
బాలకృష్ణ, రణ్‍బీర్ కపూర్

Unstoppable with NBK: నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసే అన్‍స్టాపబుల్ టాప్ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. అన్‍స్టాపబుల్ మూడో సీజన్ కూడా ఇటీవలే షురూ అయింది. లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఈ సీజన్ వచ్చింది. ఇక, ఈ అన్‍స్టాపబుల్‍కు తొలిసారి బాలీవుడ్ హీరో వస్తున్నారు. దీన్ని పాన్ ఇండియా ఎపిసోడ్ అంటూ ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ పేర్కొంటోంది. బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్.. అన్‍స్టాపబుల్‍లో సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్‍కు సంబంధించిన షూటింగ్ నేడు జరిగినట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

యానిమల్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రణ్‍బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అన్‍స్టాపబుల్‍కు వస్తారని కొంతకాలంగా వినిపిస్తోంది. ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ కూడా ఇటీవలే దీన్ని కన్ఫార్మ్ చేసింది. అన్‍స్టాపబుల్ పాన్ ఇండియా ఎపిసోడ్ త్వరలోనే వచ్చేస్తోందంటూ ఊరిస్తోంది. కాగా, ఈ ఎపిసోడ్ షూటింగ్‍లో యానిమల్ మూవీ టీమ్ పాల్గొంది.

అన్‍స్టాపబుల్ షూటింగ్ కోసం రణ్‍బీర్ కపూర్ నేడే హైదరాబాద్ వచ్చారు. అన్‍స్టాపబుల్ సెట్స్‌కు వెళ్లారు. షూటింగ్‍లో పాల్గొన్నారు. కాగా, హోస్ట్ బాలకృష్ణతో రణ్‍బీర్ కలిసి దిగిన ఫొటో ఒకటి బయటికి వచ్చింది. ఆడియన్స్‌కు రణ్‍బీర్ హాయ్ చెబుతుండగా పక్కనే బాలయ్య ఉన్నారు. రణ్‍బీర్ కపూర్ బ్రౌన్ చెక్డ్ షర్ట్, లోపల వైట్ టీషర్ట్ ధరించారు. అన్‍స్టాపబుల్ హోస్ట్ బాలకృష్ణ బ్లాక్ షర్టుపై బ్లాక్ బ్లేజర్ వేసుకున్నారు.

బాలకృష్ణతో రణ్‍బీర్ కపూర్ ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లయన్ మీట్స్ యానిమల్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

యానిమల్ సినిమా డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ కానుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాకు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉంది. దీన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అన్‍స్టాపబుల్‍కు యానిమల్ టీమ్ వస్తోంది. త్వరలో ఈ పాన్ ఇండియా అన్‍స్టాపబుల్ ఎపిసోడ్ వస్తుందని ఆహా వెల్లడిస్తోంది.

యానిమల్ సినిమా నుంచి మూడో పాట “నాన్న నువ్ నా ప్రాణం” నేడే వచ్చింది. ఈ సినిమాలో రణ్‍బీర్ కపూర్, నాన్న పాత్ర చేస్తున్న అనిల్ కపూర్ మధ్య సెంటిమెంటల్ సాంగ్‍గా ఇది ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న యానిమల్ విడుదలవుతుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.