Rana Naidu Trailer: రానా నాయుడు ట్రైల‌ర్ వ‌చ్చేసింది - రిలీజ్ డేట్ ఫిక్స్‌-rana naidu web series trailer out and released date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rana Naidu Web Series Trailer Out And Released Date Locked

Rana Naidu Trailer: రానా నాయుడు ట్రైల‌ర్ వ‌చ్చేసింది - రిలీజ్ డేట్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 16, 2023 06:28 AM IST

Rana Naidu Trailer: ద‌గ్గుబాటి హీరోలు వెంక‌టేష్‌, రానా తొలిసారి క‌లిసి న‌టిస్తోన్న రానా నాయుడు వెబ్‌సిరీస్ ట్రైల‌ర్ బుధ‌వారం విడుద‌లైంది. ఈ సిరీస్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

 రానా , వెంక‌టేష్‌,
రానా , వెంక‌టేష్‌,

Rana Naidu Trailer: రానా నాయుడు వెబ్‌సిరీస్‌తో ద‌గ్గుబాటి హీరోలు వెంక‌టేష్‌(Venkatesh), రానా (Rana) డిజిట‌ల్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఈ సిరీస్‌తోనే బాబాయ్ అబ్బాయ్‌ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. రానా నాయుడు సిరీస్ ట్రైల‌ర్‌ను బుధ‌వారం రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను ముంబాయిలో గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో వెంక‌టేష్‌, రానా పాల్గొన్నారు.

తండ్రీకొడుకుల క‌థ‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సిరీస్ తెర‌కెక్కింది. ఇందులో బాలీవుడ్‌ సెల‌బ్రిటీల‌కు వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే వ్య‌క్తిగా రానా క‌నిపించ‌గా అత‌డి తండ్రి నాగ‌గా వెంక‌టేష్ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ చేశారు. పెద్ద ప్రాబ్ల‌మ్ వ‌చ్చి ప‌డింది. నాకు భ‌యంగా ఉంది. రానా నువ్వు మాత్ర‌మే హెల్ప్ చేయ‌గ‌ల‌వు అని ఓ వ్య‌క్తి అన‌గా... నేను చూసుకుంటా అంటూ రానా చెప్పే డైలాగ్‌తో రానా నాయుడు ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది.

పూర్తిగా నెరిసిన గ‌డ్డంతో వెంక‌టేష్ క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇవ్వ‌డం ఆస‌క్తిని పంచుతోంది. నాన్న‌ను జైలు నుంచి వ‌దిలేశారు అన‌గానే... అలా ఎలా వ‌దిలేస్తారు ఇంకో ఐదు సంవ‌త్స‌రాలు జైలులో ఉండాలిగా అంటూ రానా తండ్రిని ద్వేషిస్తూ క‌నిపించారు. నీకు నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా ఇప్పుడే బుల్లెట్ దింపి వ‌చ్చాను అంటూ వెంక‌టేష్ క్యారెక్ట‌ర్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఈ ట్రైల‌ర్‌లో చూపించారు.

నువ్వు ఇక్క‌డ‌కు రాకుండా ఉండాల్సిది నాగ అని రానా అన‌గా... నాన్న అని కూడా పిల‌వ‌వా...నేను మీ నాన్న‌నురా అంటూ వెంక‌టేష్ చెప్ప‌డం ఆస‌క్తిని పంచుతోంది. ఈ ట్రైల‌ర్ మొత్తం తండ్రీకొడుకుల పోరాటాన్ని చూపించారు. అమెరిక‌న్ సిరీస్ నే డోనోవ‌న్‌కు ఇండియా ఎడాప్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న రానా నాయుడు సిరీస్‌కు క‌ర‌ణ్ అన్షుమాన్‌, సుప‌ర్న్ ఎస్ వ‌ర్మ నిర్మించారు.

మార్చి 10 నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. బాబాయ్‌ వెంక‌టేష్‌తో క‌లిసి తొలిసారి న‌టించిన ఈ వెబ్‌సిరీస్ త‌న‌కు ఎంతో స్పెష‌ల్ అని ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌లో రానా అన్నాడు. నాగ పాత్ర పూర్తిగా త‌న‌కు కొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను పంచింద‌ని వెంక‌టేష్ పేర్కొన్నారు.

ప్రసిద్ధ అమెరికన్ సిరీస్ రే డోనోవన్‌కు ఎడాప్ట్టేషన్ అయిన రానా నాయుడులో వెంకటేష్ దగ్గుబాటి ఇంటెన్స్ పాత్రలో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 

రానా దగ్గుబాటి తన బాబాయ్, నెట్‌ఫ్లిక్స్‌తో మొదటిసారి కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ, ‘ఈ ప్రాజెక్ట్ చాలా కారణాల వల్ల ప్రత్యేకమైనది. ఇది నెట్‌ఫ్లిక్స్‌తో బాబాయ్ వెంకీతో నా మొదటి కొలాబరేషన్ . ఈ ప్రాజెక్ట్‌లో సుందర్ (ఆరోన్,) కరణ్ (అన్షుమాన్) సుపర్ణ్ (వర్మ)తో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. మొత్తం తారాగణం, టీం ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. రానా నాయుడు పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించింది. అతను తన కుటుంబంతో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్న సంక్లిష్టమైన పాత్ర, అదే సమయంలో తన తండ్రితో అతని సంబంధంతో కూడా పోరాడే పాత్ర. రానా, నాగ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రపంచాన్ని అందరూ ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అన్నారు.

వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ .. ‘రానా నాయుడు’ లాంటి ఎగ్జైటింగ్ షో కోసం మొదటిసారిగా మా అన్నయ్య  గారి అబ్బాయితో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా అనిపించింది. నాగ పాత్రను పోషించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. నేను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదు. నాగ ఒక రిఫ్రెష్ చేంజ్. ఈ పాత్ర తెలివైన, ఆకర్షణీయమైన లేయర్లుగా వుంటుంది. నా అభిమానులు ఏం చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా విధాలుగా కొత్తది. ఈ సిరీస్‌లో ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతల బృందంతో కలిసి పనిచేయడం నిజంగా అద్భుతమైన అనుభవం..’ అని అన్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.