Nagabandham: గుప్త నిధుల ఇతివృత్తాలతో ఎపిక్ అడ్వెంచర్‌గా నాగబంధం.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి-rana daggubati launch nagabandham first look of vikrant karrna rudhra role directed by abhishek nama ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nagabandham: గుప్త నిధుల ఇతివృత్తాలతో ఎపిక్ అడ్వెంచర్‌గా నాగబంధం.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి

Nagabandham: గుప్త నిధుల ఇతివృత్తాలతో ఎపిక్ అడ్వెంచర్‌గా నాగబంధం.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి

Sanjiv Kumar HT Telugu

Rana Daggubati Released Nagabandham First Look: గుప్త నిధుల నేపథ్యంతో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కనుంది నాగబంధం మూవీ. ఈ సినిమా నుంచి తాజాగా రుద్ర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దగ్గుబాటి రానా విడుదల చేశారు. ఆ విశేశాల్లోకి వెళితే..!

గుప్త నిధుల ఇతివృత్తాలతో ఎపిక్ అడ్వెంచర్‌గా నాగబంధం.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి

Rana Daggubati Released Nagabandham First Look: హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ 'నాగబంధం' నుంచి రుద్రగా యువ హీరో విరాట్ కర్ణ ప్రీ-లుక్ ఇటీవల విడుదలై మంచి బజ్ క్రియేట్ చేసింది. పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ గ్రాండ్-స్కేల్ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రానా దగ్గుబాటి లాంచ్ చేశారు.

భయంకరమైన మొసలి

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విరాట్ కర్ణ ఫెరోషియస్ రగ్గడ్ అవతార్‌లో సాలిడ్ ఫిజక్‌తో కనిపించారు. యాక్షన్-ప్యాక్డ్ పోస్టర్‌లో అతని సిక్స్-ప్యాక్ అబ్స్ ప్రజెంట్ చేస్తోంది. కర్ణను స్టన్నింగ్ అవతార్‌లో, సముద్రంలో భయంకరమైన మొసలితో పోరాడుతున్నట్లు చూపిస్తున్న ఫస్ట్ లుక్ అదిరిపోయింది. తన ఒట్టి చేతులు, తాడుతో మొసలి నోరు తెరిచి పట్టుకున్న రుద్ర డేరింగ్ నేచర్ ఆకట్టుకుంది.

ది సీక్రెట్ ట్రెజర్ ట్యాగ్‌లైన్

ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా క్యురియాసిటీని క్రియేట్ చేసింది. 'ది సీక్రెట్ ట్రెజర్' అనే ట్యాగ్‌లైన్‌తో 'నాగబంధం' ఒక ఎపిక్ అడ్వంచర్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే రెండింటికీ తనదైన విజన్ తీసుకువస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ఆధ్వర్యంలో కిషోర్ అన్నపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా గర్వంగా సమర్పిస్తున్నారు.

హీరోయిన్స్‌గా నభా నటేష్, ఐశ్వర్య మీనన్

నాగబంధం పాన్-ఇండియన్ ఎపిక్, ఆధ్యాత్మికతను ఉత్కంఠభరితమైన సాహసయాత్రతో మిళితం చేస్తుంది. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషించారు.

విష్ణు దేవాలయాల రహస్యం

నాగబంధం సినిమాను పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుండి ప్రేరణ పొంది, ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో ఉంటుంది. ఈ పవిత్ర స్థలాలను రక్షించే నాగబంధం పురాతన ఆచారాలపై దృష్టి సారించి, భారతదేశంలోని విష్ణు దేవాలయాల చుట్టూ ఉన్న రహస్యాన్ని నాగబంధంలో అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు.

టెక్నికల్ టీమ్

నాగబంధం అసాధారణమైన నిర్మాణ విలువలు, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ హై -ఆక్టేన్ అడ్వెంచర్ సినిమాగా రానుంది. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ ఎస్ డీవోపీగా పని చేస్తున్నారు. అభే సంగీత దర్శకుడు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాయగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు. అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు చేపట్టారు.

పాన్ ఇండియా చిత్రంగా

ఈ నాగబంధం సినిమా ఇదే ఏడాది అయిన 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. మరిన్ని వివరాలను ముందు ముందు వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.