Rana Daggubati: సిద్ధు చాలా కాంప్లికేటెడ్.. ఇంకో సినిమా చేయనన్నారు, మరో ఆప్షన్ లేక ఇక్కడున్నా: రానా దగ్గుబాటి కామెంట్స్
Rana Daggubati About Siddu Jonnalagadda Its Complicated Release: సిద్ధు జొన్నలగడ్డ నటించిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాను ఇట్స్ కాంప్లికేటెడ్ టైటిల్‌తో ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రానా దగ్గుబాటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rana Daggubati On Siddu Jonnalagadda Its Complicated Release: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. సిద్ధు దశ తిరిగింది. అంతకుముందు సిద్ధు జొన్నలగడ్డ చేసిన సినిమాలై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
ఓటీటీలో రిలీజైన తర్వాత
అలా 2020 సంవత్సరంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమానే కృష్ణ అండ్ హిజ్ లీలా. కరోనా కారణంగా థియేటర్లలో ఈ మూవీ విడుదల కాలేదు. దాంతో నేరుగా ఆహాలో కృష్ణ అండ్ హిజ్ లీలా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆహా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలో విడుదలైన సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి.
అయితే, కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా టైటిల్ మార్చి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇట్స్ కాంప్లికేటెడ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తోంది మూవీ టీమ్.
ఇట్స్ కాంప్లికేటెడ్ ప్రెస్ మీట్
ఈ క్రమంలోనే తాజాగా సినిమాలోని హీరో హీరోయిన్స్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, నిర్మాత రానా దగ్గుబాటి, డైరెక్టర్ రవికాంత్ పెరెపు ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఇట్స్ కాంప్లికేటెడ్ ప్రెస్ మీట్‌లో హీరో రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.
హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. "ఇట్స్ కాంప్లికేటెడ్.. ప్రతి మనిషి జీవితంలో ఎదో కాంప్లికేషన్ ఉంటుంది. నా జీవితంలో డైరెక్టర్ రవికాంత్, ఆ తర్వాత సిద్దు కాంప్లికేటెడ్ (నవ్వుతూ). రవికాంత్ చెప్పిన కథ మనసుకు చాలా దగ్గరగా ఉంది. అందరి జీవితంలో అది జరుగుతుంది. కానీ, దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఈ సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది" అని చెప్పాడు.
మరో ఆప్షన్ లేక ఇక్కడున్నా
"నిజానికి సిద్ధు, రవికాంత్‌తో మరో సినిమా చేయాలని ఉంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ చేస్తేగానీ కొత్త చిత్రం చేయనన్నారు. నాకు మరో ఆప్షన్ లేక ఇక్కడున్నా (నవ్వుతూ). చాలా ప్రేమతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా థీమ్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. బిగ్ స్క్రీన్స్‌లో ఆడియన్స్ రియాక్షన్ చూడాలనే ఎగ్జయిట్‌మెంట్ ఉంది" అని దగ్గుబాటి రానా తెలిపాడు.
హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. "ఇది మాకు బిగ్ మూమెంట్. సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కావడం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.
మ్యాజికల్ మూవీ
"ఇది చాలా స్పెషల్ సినిమా. యూనిక్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే. కరోనా సమయంలో సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ చేయలేకపోయాం. ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్‌లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. ఇదొక మ్యాజికల్ మూవీ. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి" అని హీరోయిన్ సీరత్ కపూర్ తెలిపింది.
సంబంధిత కథనం