Zee Mahotsavam OTT: టీవీలో రమ్యకృష్ణ కాజల్ జయప్రద సందడి.. ఓటీటీలో కూడా చూడొచ్చు.. ఎలా అంటే?-ramya krishna kajal agarwal jaya prada zee mahotsavam tv premiere on zee telugu and zee5 ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Zee Mahotsavam Ott: టీవీలో రమ్యకృష్ణ కాజల్ జయప్రద సందడి.. ఓటీటీలో కూడా చూడొచ్చు.. ఎలా అంటే?

Zee Mahotsavam OTT: టీవీలో రమ్యకృష్ణ కాజల్ జయప్రద సందడి.. ఓటీటీలో కూడా చూడొచ్చు.. ఎలా అంటే?

Sanjiv Kumar HT Telugu

Zee Mahotsavam Ramya Krishna Kajal Agarwal Jaya Prada: బుల్లితెరపై రమ్యకృష్ణ, కాజల్ అగర్వాల్, జయప్రద సందడి చేయనున్నారు. జీ తెలుగు 19వ వార్షికోత్సవ వేడుక జీ మహోత్సవం సందర్భంగా ఇద్దరు సీనియర్ హీరోయిన్లతో చందమామ కాజల్ అగర్వాల్ హాజరుకానుంది.

టీవీలో రమ్యకృష్ణ కాజల్ జయప్రద సందడి.. ఓటీటీలో కూడా చూడొచ్చు.. ఎలా అంటే?

Zee Mahotsavam Kajal Agarwal: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న ఛానళ్లలో జీ తెలుగు (Zee Telugu) ఒకటి. ఆసక్తికరమైన కథలతో, ఆకట్టుకునే కథనాలతో సాగుతున్న సీరియల్స్​తోపాటు భిన్నమైన కాన్సెప్ట్​లతో రూపొందుతున్న రియాలిటీ షోలు, ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచుతున్న జీ తెలుగు విజయవంతంగా 19వ సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

సరికొత్త కార్యక్రమాలతో అన్ని వయసుల ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా సాగుతున్న జీ తెలుగు 19 వసంతాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు టెలివిజన్​ చరిత్రలో నూతన ఒరవడి సృష్టిస్తూ విజయపథంలో సాగుతున్న జీ తెలుగు19వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం జీ మహోత్సవం (Zee Mahotsavam 2024) మే 19న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం చేయనున్నారు.

తెలుగు ప్రేక్షకుల నుంచి అశేష ఆదరణ పొందుతూ విజయపథాన కొనసాగుతున్న జీ తెలుగు 19వ వార్షికోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ వేడుకలో అలనాటి స్టార్ హీరోయిన్స్ జయప్రద (Jaya Prada), రమ్యకృష్ణతో (Ramya Krishna) పాటు నేటి అగ్ర కథానాయిక, చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వంటి ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొన్నారు. జీ తెలుగు 19 ఏళ్ల ప్రయాణం గురించి యాంకర్లు రవి, సిరి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సరదాగా సాగిన ఈ వేడుకలో జూనియర్​-సీనియర్ల మధ్య జరిగిన పోటీ ఆద్యంతం అలరిస్తుంది. సీనియర్ జట్టుకి జయప్రద, జూనియర్ జట్టుకి రమ్యకృష్ణ నాయకత్వం వహించారు. ఈ ఇద్దరి గ్రాండ్ ఎంట్రీతో ఘనంగా మొదలైన పోటీ డ్రామా జూనియర్స్​ అంత్యాక్షరి స్కిట్, 1980, 1990 దశకాల్లోని హీరోహీరోయిన్ల గెటప్​లతో సాగిన ప్రదర్శనలతో ఆసక్తికరంగా సాగింది.

టాలీవుడ్​ చందమామ కాజల్ అగర్వాల్ సర్​ప్రైజ్​ ఎంట్రీ జూనియర్​ టీమ్​లో మరింత ఉత్సాహం నింపింది. ఈ వేదికపై డ్రామా జూనియర్స్ పిల్లల అద్భుత ప్రదర్శనతో కె. విశ్వనాథ్, చంద్ర మోహన్, శరత్ బాబు వంటి తెలుగు సినిమా దిగ్గజ కళాకారులకు నివాళులు అర్పించారు. అనంతరం నటి జయప్రద, రమ్యకృష్ణ వారితో తమ వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకోవడంతో పాటు సినీపరిశ్రమలో వారు పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు.

సరదా సాయంకాలాన్ని మరింత వినోదంగా మారుస్తూ జూనియర్స్, సీనియర్స్ బృందం తల్లీకొడుకులు, అక్కాచెల్లెళ్ల బంధాలను ప్రతిబింబించే అద్భుత ప్రదర్శనతో అలరించారు. రమ్యకృష్ణ నటించిన పాపులర్ చిత్రం అమ్మోరును జూనియర్ టీం రీ క్రియేట్ చేసింది. యష్మి, ఇతర జూనియర్ టీం సభ్యులు రమ్యకృష్ణ జీవిత ప్రయాణాన్ని వర్ణించే ప్రదర్శనతో అబ్బురపరిచారు.

80, 90, వర్తమానాల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్స్ అయిన ప్రముఖ జీ తెలుగు షో సరిగమపలోని పాటలను సీనియర్లు, జూనియర్లు ఆలపించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం పాత, కొత్త, గతం, వర్తమానాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. ఈ వేడుక జీ తెలుగు 19 సవంవత్సరాల విజయవంతమైన ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది.

మే 19న సాయంత్ర 6 గంటలకు ఈ జీ మహోత్సవం ప్రసారం అయిన తర్వాత మరుసటిరోజు నుంచి ఓటీటీలోకి (OTT) స్ట్రీమింగ్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రముఖ ఓటీటీ జీ5లో (Zee5 OTT) జీ మహోత్సవం 2024 (Zee Mahotsavam OTT) వేడుకను స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది. ఇదివరకు 2023, 2022కు సంబంధించిన జీ మహోత్సవ వేడుకలు ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.