యశ్ రావణుడి పాత్రకు పడిపోయిన ఫ్యాన్స్.. రణ్‌బీర్‌ను డామినేట్ చేస్తాడంటూ కామెంట్స్..-ramayana first glimpse video fans call yash as ravana is perfect ranbir kapoor will be overshadowed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  యశ్ రావణుడి పాత్రకు పడిపోయిన ఫ్యాన్స్.. రణ్‌బీర్‌ను డామినేట్ చేస్తాడంటూ కామెంట్స్..

యశ్ రావణుడి పాత్రకు పడిపోయిన ఫ్యాన్స్.. రణ్‌బీర్‌ను డామినేట్ చేస్తాడంటూ కామెంట్స్..

Hari Prasad S HT Telugu

రామాయణం ఫస్ట్ గ్లింప్స్ వీడియో అభిమానులను ఫిదా చేసింది. అప్పుడే ఇందులోని పాత్రలపై చర్చ మొదలైంది. అయితే ఇందులో రావణుడి పాత్ర పోషించిన యశ్.. రాముడి పాత్ర పోషించిన రణ్‌బీర్ కపూర్ ను డామినేట్ చేస్తాడని చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

యశ్ రావణుడి పాత్రకు పడిపోయిన ఫ్యాన్స్.. రణ్‌బీర్‌ను డామినేట్ చేస్తాడంటూ కామెంట్స్..

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమా గురువారం (జులై 3) అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విడుదలైన ఒక గ్లింప్స్ వీడియోలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నట్లు ప్రకటించారు. సినిమాలోని వీఎఫ్‌ఎక్స్ (VFX), హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం వంటివి చాలామందిని ఆకట్టుకున్నాయి. కానీ, నటీనటుల ఎంపికపై, ముఖ్యంగా రణబీర్, యశ్ పాత్రలపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాముడిగా యశ్ నటించాల్సింది

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఎక్స్, రెడిట్‌లలో కొందరు నెటిజన్లు యశ్.. రాముడి పాత్రకు మరింత సరిపోతారని అభిప్రాయపడ్డారు. "రణబీర్ రాముడిగా నాకు ఇంకా నచ్చలేదు. యశ్ అయితే మరింత బాగుంటాడనిపిస్తుంది," అని ఒకరు రాశారు. మరొకరు దానికి అంగీకరిస్తూ, "యశ్ రాముడిగా మరింత సరైన ఎంపికై ఉండేవాడు" అని అన్నారు.

రణబీర్, యష్ పాత్రలు పరస్పరం మార్చుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. "ఇద్దరూ తమ పాత్రలను మార్చుకుని ఉండాల్సింది!! యశ్ గడ్డం లేకుండా లేదా 'కేజీఎఫ్' ముందున్న అతని సినిమాలను చూస్తే, రాముడికి సరిపోతాడు. రణబీర్ 'యానిమల్' లుక్‌తో రావణుడుగా చేయొచ్చు" అని ఒక రెడిట్ యూజర్ రాశారు.

రావణుడిగా యశ్ పర్ఫెక్ట్

మరోవైపు, రణబీర్‌ను యశ్ డామినేట్ చేస్తాడని.. కాబట్టి రాముడి పాత్రకు వేరే నటుడు బాగుండేవాడని కొందరు భావించారు. "ప్రభు రాముడు బలమైన స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న వ్యక్తి అయి ఉండాలి. యశ్ అతన్ని చాలా సులభంగా డామినేట్ చేస్తాడు" అని ఒకరు.. "లేదు, రణబీర్ రాముడిగా నేను అస్సలు ఊహించుకోలేను.. కానీ రావణుడిగా యశ్? ఓహో! నేను చూసేందుకు సిద్ధం!" అని రాశారు. మరొకరు దానికి అంగీకరిస్తూ.. "రావణుడిగా యశ్‌కి దీటుగా ఆ స్థాయి తేజస్సు, స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న వేరే నటుడిని రాముడిగా ఎంపిక చేసి ఉండాల్సింది" అని అన్నారు.

ఇద్దరూ పర్ఫెక్ట్ అంటూ..

అయితే, రణబీర్, యశ్ తమ పాత్రలకు సరిగ్గా సరిపోతారని, వారిద్దరినీ ఎదురెదురుగా చూడటం అద్భుతంగా ఉంటుందని నమ్మినవారు కూడా ఉన్నారు. ఒక ఎక్స్ యూజర్ ఇలా రాశారు. "రణబీర్.. 'యానిమల్' తర్వాత రాముడిగా నటిస్తున్నాడు. యష్.. 'కేజీఎఫ్' తర్వాత రావణుడిగా నటిస్తున్నాడు. ఇది వారికి ఒక సరైన ప్రయోగం అనిపిస్తుంది.. ఇద్దరూ మంచి నటులే. వారి ఫేస్ ఆఫ్ చూడాలని ఉంది.

రావణుడిగా యశ్ తో, ఇది ఆసక్తికరంగా ఉంటుంది" అని ఒక రెడిట్ యూజర్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. “అతను బాడీ లాంగ్వేజ్ సరిగ్గా పట్టుకున్నాడు. యశ్ భయంకరంగా కనిపిస్తున్నాడు. రణబీర్ బాణం పట్టుకున్న విధానం అద్భుతంగా ఉంది. అతను అలాగే చేయాలి. చాలా ఉత్సాహంగా ఉంది” అని కామెంట్ చేశారు.

అయితే యశ్ ఈ పాత్రకు సరిపోతాడా అని కొందరు సందేహించారు. ఒకరు "అతను 'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్'లోని మనోజ్ బాజ్‌పాయ్ లా ఉన్నాడు" అని అభిప్రాయపడ్డారు. మరొకరు "రావణుడిగా యశ్ ను ఎందుకు తీసుకున్నారు, కాస్టింగ్ డైరెక్టర్ సరైన నిర్ణయం తీసుకున్నాడని మీరు అనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు. ఇంకొకరు, "యశ్ యశ్ లాగే కనిపిస్తున్నాడు, ఇది నిరాశపరిచింది" అని రాశారు. ఒక ఎక్స్ యూజర్, "నిజానికి, సౌత్‌లో యశ్ రావణుడిగా ఉన్నాడనే విషయం చాలా హైప్ క్రియేట్ చేసింది" అని వివరించారు.

నమిత్ మల్హోత్రా, యశ్ తో కలిసి 'రామాయణం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పార్ట్ 1 2026 దీపావళికి, పార్ట్ 2 2027 దీపావళికి విడుదల కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం