Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోల లీక్‍తో దర్శకుడు సీరియస్.. కొత్తగా ఏ నిర్ణయం తీసుకున్నారంటే..-ramayana director nitesh tiwari took this decision after ranbir kapoor sai pallavi photos leak ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోల లీక్‍తో దర్శకుడు సీరియస్.. కొత్తగా ఏ నిర్ణయం తీసుకున్నారంటే..

Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోల లీక్‍తో దర్శకుడు సీరియస్.. కొత్తగా ఏ నిర్ణయం తీసుకున్నారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
May 01, 2024 03:19 PM IST

Ramayana Movie: రామాయణం సినిమా నుంచి రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి లుక్‍కు సంబంధించిన ఫొటోలు ఇటీవల లీకయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మళ్లీ ఇలా లీక్‍లు జరగకుండా దర్శకుడు నితేశ్ తివారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోల లీక్‍తో దర్శకుడు సీరియస్.. కొత్తగా ఏ నిర్ణయం తీసుకున్నారంటే..
Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోల లీక్‍తో దర్శకుడు సీరియస్.. కొత్తగా ఏ నిర్ణయం తీసుకున్నారంటే..

Ramayana: ఇటీవలి కాలంలో చాలా సినిమాలను లీకుల బెడద ఎదురవుతుంది. షూటింగ్ సమయంలోనే ఫొటోలు, వీడియోలు బయటికి వస్తున్నాయి. ఇది మేకర్లకు ఇబ్బందిగా మారుతోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేశ్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న రామాయణం సినిమాకు ఆరంభంలోనే లీక్‍ల ఇబ్బంది ఎదురైంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలుకాగా.. రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోలు లీక్ అయ్యాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్‍బీర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ మళ్లీ లీక్‍లు జరగకుండా డైరెక్టర్ నితేశ్ తివారీ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ప్రత్యేక సెక్యూరిటీతో..

రామాయణం సినిమా మరికొన్ని రోజుల పాటు ఔట్‍డోర్‌లో రాత్రివేళ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. సెట్‍ను చూసేందుకు వచ్చే ఎవరైనా ఫొటోలు తీయకుండా నిఘా వేసేందుకు కొత్తగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను డైరెక్టర్ నితేశ్ తివారీ నియమించారు. షూటింగ్ స్పాట్‍లో ఎవరూ ఫొటోలు తీయకుండా ఈ సెక్యూరిటీ సిబ్బంది నిత్యం పరిశీలిస్తుంటారు. ఇలా లీక్‍లను అరికట్టేందుకు దర్శకుడు నిర్ణయం తీసుకున్నారు.

రామాయణం షూటింగ్‍లో మూవీ యూనిట్‍లో ఎవరూ ఫోన్లు తీసుకురాకూడదని దర్శకుడు నితీశ్ తివారీ ముందే రూల్ పెట్టారు. అయితే, ఇటీవల రణ్‍బీర్, సాయిపల్లవి లుక్ లీక్ అవడంతో షాక్ ఎదురైంది. దీంతో బయటి నుంచి వచ్చే వారు కూడా ఫొటోలు తీయకుండా జాగ్రత్త పడేందుకు ప్రత్యేక గార్డులను నియమించారు. జూన్ వరకు ఈ షెడ్యూల్ షూటింగ్ ఉంటుందని మూవీ వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది.

కాగా, ఇటీవలే లీకైన రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. శ్రీరాముడిగా రణ్‍బీర్, సీతగా సాయిపల్లవి అద్భుతంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ పాత్రలకు సరిగ్గా సూటయ్యారనే కామెంట్లు వచ్చాయి.

రావణుడిగా యశ్.. నిర్మాతగానూ..

రామాయణం సినిమాలో కన్నడ స్టార్ యశ్.. రావణుడి పాత్ర పోషించనున్నారు. ఆయన ఈ చిత్రానికి ఓ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. నమిత్ మల్హోత్రాతో కలిసి యశ్ ఈ మూవీని నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

ఈ చిత్రంలో లారా దత్తా, అరుణ్ గ్రోవర్, షీబా చడ్డా కీరోల్స్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ మూవీలో కీలకపాత్ర చేస్తారని తెలుస్తోంది.

రామాయణం సినిమా అత్యంత భారీ బడ్జెట్‍తో రూపొందనుంది. ఈ మూవీలో అత్యాధునిక గ్రాఫిక్స్‌ను వినియోగించనున్నారట. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ కంపెనీలను ఈ మూవీ కోసం దర్శకుడు నితేశ్ తివారీ నియమించుకున్నారని తెలుస్తోంది. బెస్ట్ వీఎఫ్‍ఎక్స్ విభాగంలో ఆస్కార్ అవార్డులు గెలిచిన లండన్‍కు చెందిన విజువల్ ఎఫెక్ట్ కంపెనీ ‘డీఎన్ఈజీ’.. రామాయణం సినిమా కోసం పని చేయనుందని సమాచారం బయటికి వచ్చింది.

రామాయణం సినిమా తొలి భాగాన్ని 2025లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే షూటింగ్ జోరుగా సాగుతోంది. జూలై నుంచి ఈ చిత్రం షూటింగ్‍లో యశ్ కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. మొత్తంగా రామాయణం ఇతిహాసం ఆధారంగా వస్తున్న ఈ మూవీపై విపరీతమైన ఆసక్తి ఉంది.

Whats_app_banner