Ramam Movie: భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రామం మూవీ.. హీరోగా టాలీవుడ్ రైజింగ్ స్టార్.. నిర్మాత ఏం చెప్పారంటే?-ramam the rise of akira movie title motion poster released and produced by venu donepudi tollywood rising star as hero ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ramam Movie: భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రామం మూవీ.. హీరోగా టాలీవుడ్ రైజింగ్ స్టార్.. నిర్మాత ఏం చెప్పారంటే?

Ramam Movie: భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రామం మూవీ.. హీరోగా టాలీవుడ్ రైజింగ్ స్టార్.. నిర్మాత ఏం చెప్పారంటే?

Sanjiv Kumar HT Telugu

Ramam Movie Title Motion Poster Released: తెలుగులో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది రామం. ది రైజ్ ఆఫ్ అకీరా అనేది ట్యాగ్‌లైన్. ఇంటర్నేషనల్ విలువలతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం కానున్న రామం మూవీ టైటిల్ పోస్టర్‌ను శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ చేశారు. హీరోగా టాలీవుడ్ రైజింగ్ స్టార్ చేయనున్నారు.

భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రామం మూవీ.. హీరోగా టాలీవుడ్ రైజింగ్ స్టార్.. నిర్మాత ఏం చెప్పారంటే?

Ramam Movie Title Motion Poster Released: రాముడు, రామాయణం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ప్రభాస్ ఆదిపురుష్ నుంచి ఇంకా రిలీజ్ కాని రణ్‌బీర్ కపూర్ రామాయణ్ వరకు ఎన్నో ఉన్నాయి. అయితే, ఇదే రామాయణం కాన్సెప్ట్‌తో తెలుగు నిర్మాత కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు.

ది రైజ్ ఆఫ్ అకీరా ట్యాగ్‌లైన్

శ్రీరామ నవమి (ఏప్రిల్ 6) సందర్భంగా చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి.. ‘రామం’ అనే పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనేది ట్యాగ్ లైన్. రామం చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. అయితే అతనెవరే వివరాలు ఇంకా తెలియపరచలేదు.

ఇప్పటివరకు రానటువంటి సినిమా

ధర్మ సంస్థాపనకు యుద్ధం చేసిన రాముడి అడుగు జాడల్లో నడుస్తూ.. ఆయన చూపిన బాట ప్రపంచానికి ఆదర్శం అని చాటి చెప్పే వీరుడుకి సంబంధించి, ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఓ గొప్ప యోధుడికి సంబంధించిన కథాంశంతో రూపొందుతోన్న సినిమా ఇది అని మేకర్స్ చెబుతున్నారు.

అంతర్జాతీయ విలువలతో

ఇండస్ట్రీలో పలువురి దర్శకుల దగ్గర పని చేసిన లోక‌మాన్య‌ని ఈ రామం చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు వేణు దోనేపూడి. భారీ బడ్జెట్‌, అంత‌ర్జాతీయ విలువ‌ల‌తో పాన్ ఇండియా మూవీగా ‘రామం’ సినిమాను రూపొందిస్తున్నారు. భారతీయులకు పర్వదినమైన శ్రీరామనవమి సందర్భంగా ‘రామం’ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

సూర్యుడి వెలుతురులో

గుర్రం మీద జై శ్రీరామ్ అనే జెండా పట్టుకుని ఓ వీరుడితో ఉన్న రామం మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో సూర్యుడి వెలుతురులో చక్రం కనిపించడం ఇంటెన్స్‌తో ఉంది. ఇదిలా ఉంటే, రామం టైటిల్ మోషనల్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత వేణు దోనేపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అధర్మం నిర్మూలించడానికి

"సమస్త మానవాళికి తారక మంత్రం శ్రీరామనామం. ధర్మ సంస్థాపనకు శ్రీరామచంద్రుడు చూపిన బాటే కాదు.. అధర్మం నిర్మూలించటానికి ఆయన కోదండం చేపట్టి చూపిన వీరత్వం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అలాంటి గొప్ప సమగ్ర మూర్తిమత్వాన్ని ఆధారంగా చేసుకుని.. నేటి కాలంలో అలనాటి రామరాజ్యాన్ని కనెక్ట్ చేస్తూ ఇప్పటి వరకు రానటువంటి వైవిధ్యమైన కథతో ‘రామం’ సినిమా మీ ముందుకు రానుంది" అని వేణు దోనేపూడి చెప్పారు.

టాలీవుడ్ రైజింగ్ స్టార్ హీరో

"ప్ర‌స్తుతం రామం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్‌కాంప్రమైజ్డ్‌గా, అత్యుత్తమ ప్రమాణాలతో, అంతర్జాతీయ సాంకేతిక విలువలతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించ‌నున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌కి చెందిన ఓ రైజింగ్ స్టార్ హీరోగా నటిస్తున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేయనున్నారు. ఆ వివరాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం" అని నిర్మాత వేణు దోనేపూడి వెల్లడించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం