The Warriorr : రామ్ ది వారియర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - నెల రోజులకు ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది
రామ్ ( Ram Pothineni) ది వారియర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ (The Warriorr Ott Release Date) ఖారరైంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు పూర్తి కాకుండానే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. ది వారియర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే...
The Warriorr Ott Release Date: ది వారియర్ సినిమాతో గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చారు హీరో రామ్. లింగుస్వామి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 14న తెలుగుతో పాటు తమిళంలో ఒకేరోజు రిలీజ్ అయ్యింది. తాజాగా థియేటర్లలో విడుదలై నెల రోజులు పూర్తికాకుండానే ఈ సినిమా ఓటీటీలోకిరాబోతున్నది. ఆగస్ట్ 11న డిస్నీ ప్లస్‌హాట్‌స్టార్‌లో విడుదలకానుంది.
దాదాపు ముప్పై ఐదు కోట్లకు ది వారియర్ డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్‌హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్‌మా సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. నాలుగు వారాలు కాకముందే ది వారియర్ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుండటం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాతోనే రామ్ కోలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. తమిళ స్ట్రెయిట్ హీరోల సినిమాలకు ధీటుగా ప్రమోషనల్ ఈవెంట్స్ ను నిర్వహించడం కోలీవుడ్ లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రచార కార్యక్రమాల్లో ది వారియర్ విజయంపై రామ్ ధీమా వ్యక్తం చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ రొటీన్ కమర్షియల్ పాయింట్ కారణంగా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది.
టాపిక్