Ram Setu Anthem: జై శ్రీరామ్‌.. రామ్‌ సేతు ఆంథెమ్‌ సాంగ్‌ ఓ విజువల్‌ ఫీస్ట్-ram setu anthem song jai shree ram is visual feast to watch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Setu Anthem Song Jai Shree Ram Is Visual Feast To Watch

Ram Setu Anthem: జై శ్రీరామ్‌.. రామ్‌ సేతు ఆంథెమ్‌ సాంగ్‌ ఓ విజువల్‌ ఫీస్ట్

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 03:21 PM IST

Ram Setu Anthem: జై శ్రీరామ్‌ అంటూ సాగిపోయే రామ్‌ సేతు మూవీ ఆంథెమ్‌ సాంగ్‌ను మేకర్స్‌ గురువారం (అక్టోబర్‌ 20) రిలీజ్ చేశారు. రామసేతును కనిపెట్టడానికి ఓ సాహస యాత్ర చేసే అక్షయ్‌కుమార్‌ను ఇందులో చూస్తాం. సాంగ్‌ మొత్తం ఓ విజువల్‌ ఫీస్ట్‌ అని చెప్పొచ్చు.

రామ్ సేతు మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్, అక్షయ్ కుమార్
రామ్ సేతు మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్, అక్షయ్ కుమార్

Ram Setu Anthem: బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన మరో ప్రతిష్టాత్మక సినిమా రామ్‌ సేతు. రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి శ్రీరాముడు నిర్మించాడని చెబుతున్న రామసేతును గుర్తించే పనిలో ఉన్న ఓ ఆర్కియాలజిస్ట్‌గా ఈ సినిమాలో అక్షయ్‌ కనిపించనున్నాడు. ఆకాశం నుంచి చూసినా కనిపించే నిర్మాణంగా రామసేతుకు పేరున్నా.. ఇప్పటికీ దాని ఉనికిపై చర్చ జరుగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో రామ్‌ సేతు పేరుతో ఈ సినిమా తీస్తుండటం విశేషం. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రామ్‌సేతు ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా.. తాజాగా గురువారం (అక్టోబర్‌ 20) ఆంథెమ్‌ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జై శ్రీరామ్‌ అంటూ సాగే ఈ పాట మొత్తం రామ్‌ సేతు కోసం అక్షయ్‌ చేసే సాహసయాత్ర, అందులో అతనికి ఎదురయ్యే అడ్డంకులను చూపిస్తూ సాగింది.

ఈ ఆంథెమ్‌ సాంగ్‌ ఓ విజువల్‌ ఫీస్ట్‌గా చెప్పొచ్చు. ఇదొక్క సాంగ్‌తోనే ఈ రామ్‌ సేతు మూవీ ఎలా ఉండబోతోందో మేకర్స్‌ కళ్లకు కట్టారు. సముద్ర లోతులు, ఎడారుల్లో అక్షయ్‌ సాహస యాత్ర సాగుతుంది. ఈ మ్యూజిక్‌ వీడియో ఫ్యాన్స్‌కు మంచి థ్రిల్‌ పంచుతోంది. విక్రమ్‌ మాంట్రోస్‌ ఈ పాట పాడడంతోపాటు మ్యూజిక్‌ కూడా అందించాడు. ఇక శేఖర్‌ అస్తిత్వ లిరిక్స్‌ అందించాడు.

ఈ రామ్‌ సేతు మూవీలో టాలీవుడ్‌ స్టార్‌ సత్యదేవ్‌ కూడా ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. నాజర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా, ప్రవేశ్‌ రానా ముఖ్యమైన పాత్రలు పోషించారు. అభిషేక్‌ శర్మ ఈ సినిమాకు కథ అందించడంతోపాటు దర్శకత్వం వహించాడు. రామ్‌ సేతు మూవీ అక్టోబర్‌ 25న హిందీతోపాటు తెలుగు, తమిళంలలోనూ రిలీజ్‌ కాబోతోంది. ఆ తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమ్‌ కానుంది.

IPL_Entry_Point

టాపిక్