Double iSmart vs Mr Bachchan: హరీశ్ శంకర్ ట్వీట్‍కు స్పందించిన హీరో రామ్ పోతినేని
Double iSmart vs Mr Bachchan: మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల బాక్సాఫీస్ పోటీ క్యూరియాసిటీని పెంచేసింది. ఇదే హాట్‍టాపిక్‍గా ఉంది. ఈ తరుణంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ చేసిన ట్వీట్‍కు రామ్ పోతినేని రిప్లై ఇచ్చారు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఓ ఆసక్తికరమైన పోటీ జరగనుంది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్, ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని మాస్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ తలపడనున్నాయి. ఈ రెండు సినిమాలు ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. దీంతో ఇండిపెండెన్స్ డే రోజున బాక్సాఫీస్ వార్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోటీకి దిగాలని మిస్టర్ బచ్చన్ నిర్ణయం తీసుకోవడంపై డబుల్ ఇస్మార్ట్ టీమ్ అసంతృప్తిగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో మిస్టర్ బచ్చన్ డైరెక్టర్ హరీశ్ శంకర్ చేసిన ఓ ట్వీట్‍కు రామ్ పోతినేని స్పందించారు.
హరీశ్ ట్వీట్.. థ్యాంక్స్ చెప్పిన రామ్
డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ కట్ బాగుందని, బోయపాటి సినిమాలకు చేసే ఎడిటర్ చేశారని ఎక్స్ (ట్విట్టర్)లో ఓ ట్వీట్ వచ్చింది. దీనికి హరీశ్ శంకర్ స్పందించారు. “పూరి సర్ మ్యాజికల్ క్యారెక్టర్‌లో రామ్ ఎనర్జీని చూసేందుకు వేచిచూడలేకున్నా” అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.
హరీశ్ ట్వీట్‍కు రామ్ పోతినేని రిప్లై ఇచ్చారు. మిస్టర్ బచ్చన్ కూడా హిట్ కావాలంటూ విషెస్ చెప్పారు. “థాంక్యూ. మీకు కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా” అని రామ్ స్పందించారు. ఓ వైపు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ పోటీ హీట్ పెరుగుతున్న తరుణంలో వీరిద్దరి మధ్య ఈ ట్వీట్ పలకరింపులు జరిగాయి.
చార్మీకి కోపం వచ్చిందా?
డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు చార్మీ కౌర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే, మిస్టర్ బచ్చన్ తమకు పోటీగా ఆగస్టు 15వ తేదీనే డేట్ ఖరారు చేసుకోవడంపై చార్మీకి కోపం వచ్చిందని రూమర్లు వచ్చాయి. సోషల్ మీడియాలో హరీశ్‍ను ఆమె అన్‍ఫాలో చేయడంతో ఇవి బలపడ్డాయి.
పోటీ ఎందుకో చెప్పిన హరీశ్ శంకర్
తన గురువైన పూరి జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఆగస్టు 15న ఎందుకు పోటీ పడాల్సి వస్తోందో మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‍లో హరీశ్ శంకర్ వివరించారు. ఆర్థిక కారణాలు, ఓటీటీ డీల్ వల్ల తాము అదే రోజన విడుదల చేయకతప్పడం లేదని అన్నారు. డబుల్ ఇస్మార్ట్ టీమ్ ముందుగానే డేట్ ప్రకటించిందని, తాము తర్వాత వద్దామనుకున్నా ఆగస్టు 15నే విడుదల చేయకతప్పడం లేదని హరీశ్ శంకర్ అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ కూడా అదే రోజున రావాలని చెప్పారని వెల్లడించారు.
2019లో వచ్చిన బ్లాక్‍బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‍గా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ చిత్రం వస్తోంది. రామ్ - పూరి మరోసారి ఆ మాస్ యాక్షన్ మ్యాజిక్‍ను రిపీట్ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటి వరకు వచ్చిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.
హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ చిత్రం 1980ల బ్యాక్‍డ్రాప్‍లో రూపొందింది. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మిక్కీ జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ క్లాష్ ఎలా ఉంటుందో చూడాలి.