The Warrior: వారియర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఎమోషనల్‌ అయిన రామ్‌-ram pothineni gets emotional in the warrior pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Pothineni Gets Emotional In The Warrior Pre Release Event

The Warrior: వారియర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఎమోషనల్‌ అయిన రామ్‌

HT Telugu Desk HT Telugu
Jul 11, 2022 10:11 AM IST

The Warrior: ఎప్పుడూ లవ్‌స్టోరీస్‌తో క్యూట్‌ లుక్‌లో కనిపించే రామ్‌ పోతినేని.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తున్న మూవీ ది వారియర్‌. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

వారియర్ మూవీలో రామ్ పోతినేని
వారియర్ మూవీలో రామ్ పోతినేని (Twitter)

రామ్‌ పోతినేని బైలింగ్వల్‌ మూవీ ది వారియర్‌ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ గురువారం (జులై 14) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆదివారం రాత్రి తన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరుపుకుంది. రామ్, కృతిశెట్టితోపాటు సినిమా యూనిట్‌ అంతా ఈ వేడుకకు హాజరైంది. ఈ ఇద్దరూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ లుక్‌లో అదరగొట్టారు. బ్లాక్‌ సూట్‌లోరామ్‌, తెల్ల చీరలో కృతి కూల్‌గా కనిపించారు.

తమిళంలోనూ రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ గత వారం చెన్నైలోనూ జరిగిన విషయం తెలిసిందే. దీనికి అక్కడి తమిళ స్టార్లంతా హాజరయ్యారు. ఇక ఈ హైదరాబాద్‌ ఈవెంట్‌లో రామ్‌ మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. అభిమానులు తనపై చూపించిన ప్రేమకు భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా తాను వారియర్‌ మూవీని చేయడం వెనుక ఉన్న కారణాన్ని వివరించాడు.

"చాలా రోజులుగా పోలీస్‌ క్యారెక్టర్‌లో కనిపించాలని అనుకుంటున్నాను. రెండు, మూడు స్క్రిప్ట్‌లు చూశాను. కానీ అన్నీ ఒకేలా అనిపించాయి. దీంతో కొన్నాళ్లు దీనిని పక్కన పెడదామనుకున్నా. అదే సమయంలో లింగుస్వామి నా దగ్గరికి వచ్చాడు. అది పోలీస్‌ పాత్ర అని చెప్పలేదు. కథ వింటున్నప్పుడు ఇప్పుడే పోలీస్‌ పాత్ర వద్దనుకున్నాను కదా అనిపించింది. అయితే అతడు చెప్పిన స్క్రిప్ట్‌ నాకు నచ్చింది. దీంతో సరే అన్నాను" అని రామ్‌ చెప్పాడు.

వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మరో యువ నటుడు ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనుండటం విశేషం. ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అందించాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్