ఎప్పుడు ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి అలాంటి కాంట్రవర్సీ కామెంట్లే చేశారు. మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ మూవీ టేకింగ్ ఫిదా అయిపోయారు ఆర్జీవీ. శనివారం (మే 17) ఈ మూవీ ఇండియాలో రిలీజైంది. ఈ మూవీ చూసిన తర్వాత ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అదిరిపోయిందని చెప్పారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ మూవీస్ అంటేనే యాక్షన్ థ్రిల్లర్స్. ఈ మూవీస్ లో టామ్ క్రూజ్ యాక్షన్ ను వీరాభిమానులున్నారు. ఈ సిరీస్ లో చివరి భాగంగా ‘మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్’ శనివారం ఇండియాలో రిలీజైంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ లాంటి లాంగ్వేజెస్ లోనూ మూవీ వచ్చేసింది.
మిషన్ ఇంపాజిబుల్ సినిమాకు కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా ఫ్యాన్సే. ఈ మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ మూవీని ప్రసాద్ ఐమ్యాక్స్ లో సెలబ్రిటీలు చూశారు. ఈ మూవీ చూసి బయటకు వచ్చాక ఆర్జీవీ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
‘‘ఎక్స్‌ట్రార్డినరీ, ఫెంటాస్టిక్. ఈ ఫిల్మ్ సూపర్. అంటే మనం కూడా ఫిల్మ్ మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది’’ అని ఆర్జీవీ అన్నారు.
మే 17న ఇండియాలో రిలీజైన మిసన్ ఇంపాజిబుల్ ఫైనల్ రెకనింగ్. . మే 23న అమెరికాలో థియేటర్లకు రాబోతోంది. దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ ఇది చాలా కామన్ అని అన్నారు. ‘‘మిషన్ ఇంపాజిబుల్ లో అన్ని పార్ట్ ల కంటే ఇదే బెస్ట్ అని అనుకుంటున్నా. సినిమాలో అన్నీ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. దీన్ని మించిన కథ రాదేమో అనుకుంటున్నా’’ అని ఆర్జీబీ చెప్పారు.
మహేష్, రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 కూడా ఇలాగే ఉంటుందంటున్నారు అని అడిగితే ‘‘అది నాకు తెలియదు కాబట్టి నేనేం చెప్పలేను’’ అని ఆర్జీవీ సమాధానమిచ్చారు.
62 ఏళ్ల వయసులో టామ్ క్రూజ్ యాక్షన్ సీక్వెన్స్ మరోసారి ఫ్యాక్ష్ తో విజిల్ కొట్టించాయి. ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ తో విధ్వంసం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న దుష్ట శక్తులను ఇంపాజిబుల్ మిషన్ ఫోర్స్ తో కలిసి టామ్ క్రూజ్ క్యారెక్టర్ అంతం చేయడమే ఈ మూవీ కథ. ఈ మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ లో ఊహకు అందని ట్విస్టులున్నాయని టాక్. ఈ థ్రిల్లర్ అందుకే ఫ్యాన్స్ తో కేకలు పెట్టిస్తోంది.
సంబంధిత కథనం