Murder Plan on Rajamouli: రాజమౌళి హత్యకు కుట్ర.. ట్విటర్ ద్వారా హెచ్చరించిన ఆర్జీవీ-ram gopal varma reveals bunch of film makers plan to murder rajamouli ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Gopal Varma Reveals Bunch Of Film Makers Plan To Murder Rajamouli

Murder Plan on Rajamouli: రాజమౌళి హత్యకు కుట్ర.. ట్విటర్ ద్వారా హెచ్చరించిన ఆర్జీవీ

Maragani Govardhan HT Telugu
Jan 24, 2023 09:20 AM IST

Murder Plan on Rajamouli: దర్శక దిగ్గజం రాజమౌళి హత్యకు కుట్ర జరుగుతుందని వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హెచ్చరించారు. ఆ గ్రూపులో తాను కూడా ఉన్నానని, నాలుగు పెగ్గులు పడటంతో సీక్రెట్ బయటపెట్టానని స్పష్టం చేశారు.

జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి
జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి (rajamouli ss Twitter)

Murder Plan on Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత అతడికే చెందింది. భారతీయ సినిమాలేవి కూడా ఊహించిన అంతర్జాతీయ వేదికలపై సగర్వంగా తలెత్తుకునేలా చేసిన రాజమౌళిపై హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌలి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని సన్నివేశాలను, పాత్రలను వివరిస్తూ ప్రశంసించడం చూస్తుంటే ఎవ్వరికైనా ఈర్ష్య పుట్టకమానదు. దీంతో మన భారతీయ దర్శకుల్లో చాలా మంది ఆయనపై జెలసీతో రగిలిపోతున్నారంటే. ఎలాగైన మన జక్కన్నను హత్య చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ గ్రూపులో తాను కూడా ఉన్నానంటూ సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా తెలియజేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే రాజమౌళి- జేమ్స్ కామెరూన్‌ సంభాషణ కలిగిన వీడియోను ట్విటర్ వేదికగా ఆర్ఆర్ఆర్ టీమ్ షేర్ చేసింది. ఈ వీడియోపై స్పందించిన ఆర్జీవీ.. రాజమౌళిపై భారతీయ దర్శకులందరీకి ఈర్ష్య పుడుతుందని ట్వీట్ చేశారు.

"హే రాజమౌళి నువ్వు మొఘల్ ఈ ఆజం తీసిన కా ఆసిఫ్‌ను అధిగమించావు. షోలే తీసిన రమేశ్ సిప్పీని దాటావు. అలాగే ఆదిత్య చోప్రాలు, కరణ్ జోహార్లు, భన్సీలీలు ఇలా భారత్‌లో ఎంతో మందిని అధిగమించవావు. నేను నీ కాలి బొటనవేలును నాకాలనుకుంటున్నాను" అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. అంతటితో ఆగకుండా భారత్‌లో చాలా మంది దర్శకులు రాజమౌళిని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ మరో ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచారు.

"రాజమౌళి సార్.. మీ భద్రతను పెంచుకోండి. ఎందుకంటే భారత్‌లో చాలా మంది ఫిల్మ్ మేకర్లు మీ మీద జెలసీతో రగిలిపోతున్నారు. వారంతా మిమ్మల్ని చంపేందుకు కుట్రపన్నుతున్నారు. నేను కూడా ఈ గ్రూపులో ఉన్నాను. నాలుగు పెగ్గులు పడేసరికి ఈ రహస్యాన్ని బయట పెట్టేశాను." అంటూ వర్మ తన ట్విటర్‌లో రాసుకొచ్చారు.

ఇదంతా చూస్తుంటే నిజంగానే రాజమౌళి హత్యకు ప్లాన్ చేస్తున్నారా? అంటే కాదనే తెలుస్తోంది. మన జక్కన్న గొప్పతనాన్ని చెప్పేందుకే ఆయన గురించి వర్మ ఈ ట్వీట్లు చేసినట్లు అర్థమవుతుంది. రాజమౌళిని చూసి మిగిలిన వాళ్లు ఎంతగా జెలసీ ఫీల్ అవుతున్నారో చెప్పే క్రమంలో కాస్తంతా మసాలాలు జోడించి ట్వీట్లను తన పదాలతో రక్తికట్టించారు మన వర్మ. ఎప్పుడు తన మాటలతో వివాదాల్లో నిలిచే ఆర్జీవీ.. ఈ సారి రాజమౌళి హత్యకు కుట్ర అంటూ పెద్ద మాటనే వాడేశారు. మరి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

ఇదిలా ఉంటే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ నామినేషన్‌కు షార్ట్ లిస్టయిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు ఆస్కార్ కమిటీ నామినేషన్ల వివరాలను తెలియజేయనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రకటించనుంది. ఆర్ఆర్ఆర్ విదేశీ ఫిల్మ్ కేటగిరీ, బెస్ట్ ఒరిజనల్ సాంగ్, బెస్ట్ యాక్టర్ లాంటి నామినేషన్లు దక్కించుకుంటుందని అభిమానులు అంచనాలు పెట్టుకుంటున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం