ఇదో కొత్త రకం గూండాయిజం: రామ్‌గోపాల్ వర్మ సంచలన ట్వీట్.. తర్వాత డిలీట్.. కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే అంటూ..-ram gopal varma on kamal haasan kannada language controversy says this is new hooliganism ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇదో కొత్త రకం గూండాయిజం: రామ్‌గోపాల్ వర్మ సంచలన ట్వీట్.. తర్వాత డిలీట్.. కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే అంటూ..

ఇదో కొత్త రకం గూండాయిజం: రామ్‌గోపాల్ వర్మ సంచలన ట్వీట్.. తర్వాత డిలీట్.. కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే అంటూ..

Hari Prasad S HT Telugu

కమల్ హాసన్ కన్నడ భాషా వివాదం, థగ్ లైఫ్ మూవీని నిషేధిస్తామన్న కన్నడ సంఘాల హెచ్చరికలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఇదో కొత్త రకం గూండాయిజం అని అతడు ట్వీట్ చేయడం గమనార్హం.

ఇదో కొత్త రకం గూండాయిజం: రామ్‌గోపాల్ వర్మ సంచలన ట్వీట్.. తర్వాత డిలీట్.. కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే అంటూ..

రామ్‌గోపాల్ వర్మ అంటేనే సంచలనాలకు మారు పేరు. ఈ మధ్య సినిమాల కంటే తన ట్వీట్స్, కామెంట్స్ తోనే వార్తల్లో ఉంటున్నాడు. ఇక ఇప్పుడు కమల్ హాసన్ కన్నడ భాషా వివాదంపై స్పందించాడు. సోమవారం (జూన్ 2) అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇదో కొత్త రకంగా గూండాయిజం అని వర్మ అంటున్నాడు.

ఇది కూడా గూండాయిజమే

ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్లుగా వ్యక్తపరిచే రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు కమల్ హాసన్ వివాదంపైనా తనదైన స్టైల్లో స్పందించాడు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ మూవీని రిలీజ్ కానివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించడం ఓ కొత్త రకం గూండాయిజం అని ఆర్జీవీ అభిప్రాయపడ్డాడు.

“ప్రజాస్వామ్యానికి కొత్త పేరు అసహనం. అందులోని నిజానిజాల సంగతిని పక్కన పెడితే కమల్ హాసన్ క్షమాపణ చెబితేనే థగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో రిలీజ్ చేయనిస్తామన్నది ఓ కొత్త రకం గూండాయిజమే అవుతుంది” అని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కాసేపటికే అతడు డిలీట్ చేయడం గమనార్హం.

కమల్ హాసన్ వివాదం ఏంటంటే?

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో ఈ నెల 5న థగ్ లైఫ్ మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కన్నడ భాషపై కమల్ స్పందిస్తూ.. అది తమిళ భాష నుంచి పుట్టినదే అని అన్నాడు. దీనిపై కన్నడ సంఘాలు, కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా మండిపడ్డాయి.

కమల్ వెంటనే క్షమాపణ చెబితేనే అతని థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయనిస్తామని, లేదంటే నిషేధిస్తామని హెచ్చరించాయి. అయినా కమల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతానని, తానే తప్పూ చేయలేదని అన్నాడు. అంతేకాదు థగ్ లైఫ్ మూవీ నిషేధం బెదిరింపులపై కర్ణాటక హైకోర్టును అతడు ఆశ్రయించాడు. మరో మూడు రోజుల్లోనే మూవీ రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఈ సమస్య ఎంత వరకూ వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం