RGV New Movie: రాంగోపాల్ వర్మ కొత్త మూవీ నా పెళ్ళాం దెయ్యం.. అనౌన్స్ చేసిన డైరెక్టర్-ram gopal varma new movie titled naa pellam deyyam rgv announced the title through social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv New Movie: రాంగోపాల్ వర్మ కొత్త మూవీ నా పెళ్ళాం దెయ్యం.. అనౌన్స్ చేసిన డైరెక్టర్

RGV New Movie: రాంగోపాల్ వర్మ కొత్త మూవీ నా పెళ్ళాం దెయ్యం.. అనౌన్స్ చేసిన డైరెక్టర్

Hari Prasad S HT Telugu
Mar 20, 2024 03:57 PM IST

RGV New Movie: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ సినిమా పేరు నా పెళ్ళాం దెయ్యం అని అతడు పెట్టడం విశేషం. టైటిల్ తోనే అతడు ఎంతో ఆసక్తి పెంచాడు.

రాంగోపాల్ వర్మ కొత్త మూవీ నా పెళ్ళాం దెయ్యం.. అనౌన్స్ చేసిన డైరెక్టర్
రాంగోపాల్ వర్మ కొత్త మూవీ నా పెళ్ళాం దెయ్యం.. అనౌన్స్ చేసిన డైరెక్టర్

RGV New Movie: ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా వరుస హిట్ మూవీస్ అందించిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. తర్వాత ఏమైందోగానీ దారుణమైన సినిమాలతో పరువు పోగొట్టుకున్నాడు. ఈ మధ్యే వ్యూహం, శపథంలాంటి సినిమాలు తీసిన అతడు.. తాజాగా తన కొత్త మూవీ నా పెళ్ళాం దెయ్యం అనే టైటిల్ తో అనౌన్స్ చేయడం విశేషం.

ఆర్జీవీ నా పెళ్ళాం దెయ్యం

రాంగోపాల్ వర్మ తన సోషల్ మీడియాఎక్స్ అకౌంట్ ద్వారా ఈ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. అసలు ఏ క్యాప్షన్ లేకుండా కేవలం ఆ పోస్టర్ మాత్రమే పోస్ట్ చేశాడు. అందులో నా పెళ్ళాం దెయ్యం అనే టైటిల్ తోపాటు ఓ తీసి పడేసినట్లుగా కనిపిస్తున్న తాళి, బ్యాక్‌గ్రౌండ్లో కిచెన్ లో పని చేసుకుంటూ కనిపించే ఓ మహిళను ఈ పోస్టర్ లో చూడొచ్చు.

నిజానికి కొన్నాళ్ల కిందటే ఆర్జీవీ వివిధ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చెప్పాడు. తాను నా పెళ్ళాం దెయ్యం పేరుతో ఓ సినిమా తీయబోతున్నానని తెలిపాడు. ఈ మూవీలో ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటాడని, ఆ తర్వాత తన పెళ్ళాం దెయ్యంగా మారుతోందని తెలుసుకుంటాడంటూ అసలు స్టోరీ పాయింట్ ను వర్మ వెల్లడించాడు. నిజానికి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పెళ్ళాం దెయ్యమనే అంటారని, తనకూ నిజ జీవితంలో అలాగే అనిపించిందని కూడా అప్పట్లో ఆర్జీవీ అన్నాడు.

ఆర్జీవీ.. అప్పుడలా.. ఇప్పుడిలా..

ఆర్జీవీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మూడున్నర దశాబ్దాలు అవుతోంది. తొలి సినిమా శివతోనే సంచలనం రేపిన అతడు.. ఆ తర్వాత క్షణక్షణం, గోవిందా గోవింద, రాత్రి, దెయ్యం, రంగీలా, సత్య, సర్కార్ లాంటి సినిమాలతో దేశం మెచ్చే డైరెక్టర్ అయ్యాడు. కానీ గత దశాబ్దకాలంగా ఆర్జీవీ సినిమాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. రక్త చరిత్ర తర్వాత ఆర్జీవీ తీసిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఈ మధ్యే వ్యూహం అనే సినిమాతో వచ్చాడు. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఇప్పుడు మరేదో సినిమా తీస్తున్నట్లు తన ఎక్స్ అకౌంట్లో దాని షూటింగ్స్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటకలోని కూర్గ్ లో షూటింగ్ జరుగుతోంది. తాజాగా బుధవారం (మార్చి 20) నా పెళ్ళాం దెయ్యం అనే టైటిల్ తో మూవీ అనౌన్స్ చేశాడు.

టైటిల్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడం రాంగోపాల్ వర్మకు అలవాటే. అయితే తన ఈ నెక్ట్స్ మూవీలో ఏం చెప్పబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. నా పెళ్ళాం దెయ్యం మూవీ గురించి ఆర్జీవీ మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది.

ఇక తాను ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని, పవన్ కల్యాణ్ పై తాను పోటీ చేయనున్నట్లు ఈ మధ్యే సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసి రాంగోపాల్ వర్మ సంచలనం రేపాడు.