RGV: పవన్ కల్యాణ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు.. విద్యార్థుల ప్రశ్నలు.. చచ్చాకే అంటూ రామ్ గోపాల్ వర్మ సమాధానాలు-ram gopal varma answers on movies with pawan kalyan and sandeep reddy vanga to students in saaree interact meet rgv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rgv: పవన్ కల్యాణ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు.. విద్యార్థుల ప్రశ్నలు.. చచ్చాకే అంటూ రామ్ గోపాల్ వర్మ సమాధానాలు

RGV: పవన్ కల్యాణ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు.. విద్యార్థుల ప్రశ్నలు.. చచ్చాకే అంటూ రామ్ గోపాల్ వర్మ సమాధానాలు

Sanjiv Kumar HT Telugu

Ram Gopal Varma On Movie With Pawan Kalyan Sandeep Reddy Vanga: పవన్ కల్యాణ్‌ సినిమాను డైరెక్ట్ చేస్తారా.. సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో మూవీని ఆశించవచ్చా అనే ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్‌లో ఆన్సర్స్ ఇచ్చారు. శారీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్జీవీ ఈ కామెంట్స్ చేశారు.

పవన్ కల్యాణ్, సందీప్ రెడ్డి వంగాతో సినిమాలు.. విద్యార్థుల ప్రశ్నలు.. చచ్చాకే అంటూ రామ్ గోపాల్ వర్మ సమాధానాలు

Ram Gopal Varma On Pawan Kalyan Sandeep Reddy Vanga: విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ లేటెస్ట్‌ మూవీ ‘శారీ’. ‘టూ మచ్‌ లవ్‌ కెన్‌ బి స్కేరీ’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ సినిమాకు గిరి కృష్ణకమల్‌ దర్శకత్వం వహించారు.

ఆరాధ్య దేవి హీరోయిన్‌గా

ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్‌ వర్మ శారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ‘శారీ’ మూవీని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇందులో సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా నటించారు.

ఆర్జీవీ సోదరితోపాటు

శారీ సినిమాను పలు యదార్థ ఘటనల ఆధారంగా నిర్మించారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన శారీ చిత్రంపై ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్స్‌ కాలేజీలో రామ్‌గోపాల్‌వర్మతోపాటు నటులు సత్య, ఆరాధ్య దేవి, నిర్మాత రవిశంకర్‌ వర్మ, ఆర్జీవీ సోదరి విజయ పాల్గొన్నారు.

విద్యార్థుల అభిప్రాయాలు

'ప్రస్తుతం సమాజంలోని సంబంధాలపై సోషల్‌ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంది?' అనే విషయంపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది విద్యార్థినీ విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు.

భావి భారత నిర్మాతలకు

ఈ సందర్భంగా ముందుగా రామ్ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. "భావి భారత నిర్మాతలకు గుడ్‌ ఈవెనింగ్‌. అలాగే, ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను కూడా మీలాగే ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ని. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ‘శారీ’ మూవీ సోషల్‌ మీడియా ప్రభావం దాని ద్వారా ప్రమాద భరితంగా జరుగుతున్న కొన్ని అంశాలను ముఖ్య కథాంశంగా తీసుకోవడం జరిగింది" అని అన్నారు.

బ్యాక్‌గ్రౌండ్‌, ఫోర్‌గ్రౌండ్‌ తెలుసుకోకుండా

"సోషల్‌ మీడియాలో ఎవరెవరో ముక్కు మొహం తెలియని వాళ్లతో పరిచయాలు పెంచుకుని, వాళ్ల బ్యాక్‌గ్రౌండ్‌ గానీ, ఫోర్‌గ్రౌండ్‌ గానీ తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేయడం వల్ల జరిగిన ఎన్నో ప్రమాదాల గురించి, భయంకర సంఘటనల గురించి మనం చాలా చాలా విన్నాం, చూశాం. అలాంటి నిజ జీవిత ఘటన ఆధారంగా తీసిన సినిమా ఈ ‘శారీ’. ఈ రోజు సినిమాలోని విషయాలను మీతో పంచుకోవడానికి ఇక్కడకు రావడం జరిగింది" అని ఆర్జీవీ తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు ఆర్జీవీ ఇచ్చిన సమాధానాలు:

అర్జీవీ గారు మీలో ఉన్న ధైర్యం నాకు కావాలి. అందుకోసం నన్ను మిమ్మల్ని హగ్ చేసుకొని ఇస్తారా?

- నేను ఇవ్వను. మగవాళ్లకు హగ్‌ చేసుకునే వాడిలా కనిపిస్తున్నానా. మీరు నన్ను హగ్ అడిగి అవమానిస్తున్నారా. నిన్ను చూస్తుంటే ఎక్కడ హగ్ చేసుకుంటావేమోనని భయమేస్తుంది.

మీరు పవన్‌ కల్యాణ్‌తో సినిమా డైరెక్ట్‌ చేస్తారా?

- నేను చచ్చాక ఆయన (పవన్‌ కల్యాణ్‌)తో డైరెక్ట్‌ చేస్తాను.

సందీప్‌ వంగా కాంబినేషన్‌లో మీ సినిమా ఆశించవచ్చా?

- అంటే ఏంటి? నేను హీరోగా అయన (సందీప్ రెడ్డి వంగా) డైరెక్ట్‌ చేయాలా? ఆయన హీరోగా నేను డైరెక్ట్‌ చేయాలా? ఇద్దరం దర్శకులం అదెలా సాధ్యం కుదరదు. సినిమా ఉండదు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం